ఇవాళ సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan Babu) పుట్టినరోజు సందర్భంగా ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్(Manoj) ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మనమంతా కలిసి వేడుకలను చేసుకునే ఈరోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం. మీతో కలిసి ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యూ” అంటూ మనోజ్ భావోద్వేగం చెందారు. ఈ పోస్టుకు నా సూర్యుడివి, నా చంద్రుడివి నువ్వే అనే సాంగ్‌ను జత చేసి ఇద్దరి ఫొటోలతో కలిపి ఓ వీడియో క్లిప్ యాడ్ చేశారు.
కాగా ఇటీవల మంచు కుటుంబంలో గొడవల కారణంగా మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ పెట్టిన ఎమోషనల్ పోస్టు ఆసక్తికరంగా మారింది. దీంతో తండ్రి, కొడుకులు ఇప్పటికైనా కలిసిపోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.