Manchu Manoj| మంచు వారి కుటుంబ వివాదంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
‘మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న నాకు దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. మా నాన్నను అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు… మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు’ అని ఆవేదనకు గురయ్యారు. అలాగే మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్‌బాబు(Mohan babu), అన్న విష్ణు(Vishnu) తరఫున క్షమాపణలు తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని.. తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు.
‘ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెలల కుమార్తెను లాగుతున్నారు. నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడగలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నా. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా’ అని మనోజ్ వెల్లడించారు.