Naturalstar Nani: దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ది పారడైజ్. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో ది పారడైజ్‌పై తెలుగు ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపు అయ్యాయి.
యాక్షన్ సీక్వెన్స్…
ది పారడైజ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. స్పెషల్‌గా వేసిన ఓ మాసివ్ సెట్‌లో నానిపై భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు ఫైట్ మాస్టర్ రియల్ సతీష్‌తో పాటు ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా పనిచేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కథలో కీలక సందర్భంలో వచ్చే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది.
Also Read – School Bus Fire Accident: ప్రైవేటు స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
మోహన్‌బాబు ఫొటో లీక్…
కాగా ది పారడైజ్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ లీకైంది. ఈ మూవీ సెట్స్ నుంచి మోహన్‌బాబు స్కెచ్‌తో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ స్కెచ్ ఫొటోలో వింటేజ్ లుక్‌లో మోహన్‌బాబు కనిపిస్తున్నారు. మోహన్‌బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఈ లీక్ ఫొటోతో కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమాలో మోహన్‌బాబు లుక్ తాలూకు స్కెచ్ ఫొటో ఇదని అంటున్నారు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో మోహన్‌బాబు కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లీక్ ఫొటోపై మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
అనిరుధ్ మ్యూజిక్…
దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి… ది పారడైజ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిరుధ్ బీజీఎమ్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని అంటున్నారు. ది పారడైజ్‌లో హీరోయిన్ ఎవరన్నది మాత్రం మేకర్స్ కన్ఫామ్ చేయలేదు.
Also Read – Boat: బోట్ నుంచి సరికొత్త ఇయర్ బడ్స్.. 80 గంటల బ్యాటరీ లైఫ్, మరెన్నో ఫీచర్లు..
ఎనిమిది భాషల్లో రిలీజ్..
ది పారడైజ్ మూవీని ఎనిమిది భాషల్లో విడుదలచేయబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ది పారడైజ్‌తో నాని క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కు చేరడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. ది పారడైజ్ తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాకు హీరో నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతుండటం గమనార్హం.


