రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించనున్న స్పిరిట్(Spirit) సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలని ఎక్స్ ద్వారా ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘స్పిరిట్‌లో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నాం. కానీ థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మాత్రమే అందుకు అర్హులు. ఒక హెడ్ షాట్ షొతోతో పాటు పర్సనల్ షాట్ ఫొటో కూడా జత చేయండి. మీ వివరాలను spirit. bhadrakalipichtures@gmail. comకి పంపండి” అని కోరింది. తాజాగా దీనిపై హీరో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ సినిమాలో నటించేందుకు తాను దరఖాస్తు చేసినట్లు తెలిపారు. మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని ట్వీట్ చేశారు. దీనికి నటుడు బ్రహ్మాజీ కూడా తాను కూడా దరఖాస్తు చేశానని వెల్లడించారు.
ఇక ఈ సినిమాకు యానిమల్ డైరెక్టర సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే ‘కన్నప్ప’ సినిమాలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 25న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటించడం విశేషం.