Kannappa Ott Partner: మంచు విష్ణు కన్నప్ప మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తున్నట్లు సమాచారం. ఈ మైథలాజికల్ మల్టీస్టారర్ మూవీ జూలై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అదే రోజు రిలీజ్ అవుతున్నట్లు తెలిసింది.
పది వారాల తర్వాతే…
కన్నప్ప మూవీని పది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తానని ప్రమోషన్స్‌లో మంచు విష్ణు చెప్పాడు. కానీ థియేటర్లలో కన్నప్ప డిజాస్టర్‌గా నిలవడంతో మాట మార్చేసిన విష్ణు నాలుగు వారాలు కాకముందే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్‌లో కన్నప్ప మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది.
Also Read – Aamir Khan Next Movie: మేఘాలయా హత్య కేసుతో సినిమా.. రంగంలోకి ఆమిర్ ఖాన్
పాన్ ఇండియన్ స్టార్స్…
కన్నప్ప మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటించగా పాన్ ఇండియన్ స్టార్స్… ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ గెస్ట్ రోల్స్ చేశారు. రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించాడు. మోహన్‌బాబు, విష్ణులతో ఉన్న అనుబంధం కారణంగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఫ్రీగా ప్రభాస్… కన్నప్ప సినిమాలో నటించాడు. ప్రభాస్ గెస్ట్ రోల్ కారణంగానే పాన్ ఇండియన్ లెవెల్‌లో కన్నప్ప సినిమాకు మంచి హైప్, బజ్ ఏర్పడింది. ప్రభాస్ ఎపిసోడ్స్ మినహా మిగిలిన కథలో బలం లేకపోవడం, ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
మహాభారత్ ఫేమ్
కన్నప్ప సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, మధుబాలతో పాటు పలువురు సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించారు. మంచు విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా కనిపించింది. మహాభారత్ సీరియల్‌ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
రెండు వందల కోట్ల బడ్జెట్…
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నప్ప మూవీ ఫుల్ థియేట్రికల్ రన్‌లో యాభై కోట్ల లోపే వసూళ్లను దక్కించుకొని నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాను మోహన్‌బాబు స్వయంగా నిర్మించారు.
Also Read – Avatar 3: Fire and Ash: ‘అవతార్ 3’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
కన్నప్ప కథ ఇదే…
తిన్నడు (మంచు విష్ణు) నాస్తికుడు. చిన్నతనంలోనే తల్లికి దూరమైన తిన్నడిని తండ్రి నాథనాథుడే పెంచి పెద్దచేస్తాడు. అమ్మవారి బలి విషయంలో తండ్రితో పాటు తన గూడెం పెద్దలను ఎదురించి ఊరి నుంచి బహిష్కరణకు గురవుతాడు తిన్నడు. పరమ నాస్తికుడైన తిన్నడు గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? తిన్నడిలో మార్పుకు రుద్ర( ప్రభాస్), మహాదేవశాస్త్రి(మోహన్‌బాబు) ఎలా కారణమయ్యారు? తిన్నడని జీవితంలోకి వచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.


