Manidhargal OTT Release: ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అయ్యేందుకు వచ్చేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మే 30న సినిమా హాళ్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు వచ్చాయి. మూవీ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.0 రేటింగ్ ఇవ్వడం విశేషం.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా మొత్తం ఒక రాత్రిలో జరిగే కథ. ఆరుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కథే ఈ సినిమా. వీరంతా కలిసి ఓ నైట్ కలిసి పార్టీ చేసుకుంటారు. అందులో అందరూ పీకలదాకా తాగి ఎంజాయ్ చేస్తారు. ఆ రాత్రి జరిగిన పార్టీనే వాళ్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. ఆరుగురు స్నేహితులు ఇబ్బందులు పాలవుతారు. ఈ క్రమంలో కథ ఎలా సాగింది? అసలు ఈ స్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది వారి మధ్య. వీటికి సమాధానం తెలియాలంటే ఈ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.
ఈ మూవీ పేరు మనిదర్గల్. అంటే తెలుగులో మనుషులు అని అర్థం. రామ్ ఇంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కపిల్ వేలవన్, దక్ష లీడ్ నటించారు. వీరితో పాటు గుణవంతన్ ధనపాల్, సాంబ శివమ్, అర్జున్‌దేవ్ శరవణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం జులై 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా తమిళం యాప్ తో పాటు సన్ నెక్ట్స్ లోనూ ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం తమిళంలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే తెలుగు డబ్ వర్షెన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.


