Manjima Mohan : మలయాళం హీరోయిన్ మంజిమా మోహన్ ఇటీవలే హీరో గౌతమ్ కార్తీక్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. మంజిమా తన కెరీర్ మొదట్లో సన్నగానే ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం బొద్దుగా తయారైంది. దీంతో మంజిమా లావుగా అయిన దగ్గర్నుంచి పలువురు నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల పెళ్ళిలో కూడా లావుగానే ఉంది. హీరో గౌతమ్ ఏమో సన్నగా ఉన్నాడు. దీంతో ఆమె పెళ్లి ఫోటోలు చూసి కూడా కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మంజిమా మోహన్ పెళ్లి తర్వాత ఓ తమిళ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన మీద వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది.
మంజిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నన్ను ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సార్లు ట్రోల్ చేశారు. నా బాడీ పై కామెంట్స్ చేశారు. కానీ నేను అవన్నీ పట్టించుకోవడం మానేశాను. కొంతమంది అయితే నా పెళ్ళికి వచ్చి పెళ్ళిలో కూడా నేను లావుగా ఉన్నాను అంటూ కామెంట్స్ చేశారు. నా బాడీ గురించి నాకు బాధ లేదు. ప్రస్తుతం నేను ఫిట్ గా, ఆరోగ్యంగా, సంతోషంగానే ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపించినప్పుడు తగ్గుతాను. ఎవరి మాటలు విని తగ్గను” అని చెప్పింది. అలాగే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని తెలిపింది.