Sunday, June 30, 2024
Homeచిత్ర ప్రభManoj: లవ్ యు అక్క అంటున్న మంచు మనోజ్

Manoj: లవ్ యు అక్క అంటున్న మంచు మనోజ్

మంచు మనోజ్, అక్క లక్ష్మీ ప్రసన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనోజ్ ఎక్కువ కాలం అమెరికాలోనే ఉండిపోయాడు. ఎందుకంటే చాలాకాలం పాటు లక్ష్మీ ప్రసన్న కూడా అక్కడే ఉన్నారు కాబట్టి. మొదటి నుంచీ వీళ్లిద్దరి బంధం అంత గొప్పగా ఉంటూ వస్తోంది. భార్యతో విడాకుల తరువాత మంచు విష్ణు రెండో పెళ్లి వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించి, చివరికి తన ఇంట్లోనే తమ్ముడికి పెళ్లి చేసింది మంచు లక్ష్మి. నాకు మనోజ్ పెద్ద కొడుకు అని తరచూ ఇంటర్వ్యూల్లో చెప్పే లక్ష్మి నిజంగానే మాట నిలుపుకుని మనోజ్ లైఫ్ సెటిల్ అవ్వటంలో పెద్దరికం చూపింది. ఇక అక్క ప్రేమకు ఆనందంతో థాంక్స్ చెబుతూ, లవ్ యు అక్క అంటూమంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ గా మారి, అక్క-తమ్ముడి అనుబంధాన్ని చర్చనీయాంశంగా చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News