MASS JATHARA: గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ, ఈసారి ‘మాస్ జాతర’ అనే పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘ధమాకా’ తర్వాత వచ్చిన ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు అనుకున్నంత ఫలితాలు ఇవ్వకపోవడంతో, రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే నిశ్చయంతో ఉన్నారు.
ఈ సినిమా రవితేజ నుంచి ప్రేక్షకులు కోరుకునే పాత మాస్ ఎనర్జీని, కొత్త విందు భోజనంలా అందిస్తుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
సినిమా మాస్ ఎలిమెంట్స్‌కి తగ్గట్టుగా, భీమ్స్ సిసిరోలియో పవర్‌ఫుల్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఆయన బీట్స్ ఇప్పటికే సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా విడుదలైన ‘హుడియో హుడియో’ లిరికల్ సాంగ్ టెర్రిఫిక్‌గా ఉంది. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని ఈ పాట విపరీతం గా ఆకట్టుకుంటుంది.హేషమ్ అబ్దుల్ వాహద్ మరియు భీమ్స్ ఇద్దరూ కలిసి ఆలపించిన ఈ పాటకి దేవ్ సాహిత్యాన్ని అందించారు.
టైటిల్‌కే తగ్గట్టుగా, ‘మాస్ జాతర’ ఒకవైపు మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, మరోవైపు క్లాస్ టచ్‌తో రూపొందుతున్నట్టు సమాచారం. రవితేజ తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ, మరియు అసాధారణ ఎనర్జీతో పోషించే పాత్రలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో కూడా అభిమానులు కోరుకునే విందు భోజనం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
శ్రీలీల హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీని భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు.
సినిమాపై అంచనాలు ఒకవైపు పెరుగుతుంటే, తాజాగా విడుదలైన ‘ఒలే ఒలే’ పాట వివాదంలో చిక్కుకోవడం ‘మాస్ జాతర’ కు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. పాటలోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి.
ఈ వివాదంపై రవితేజ మరియు టీమ్ ఇచ్చిన కౌంటర్ మరింత హాట్‌గా మారింది.
రవితేజ మాట్లాడుతూ: “ప్రజలు కేవలం స్టార్టింగ్ లైన్స్ మాత్రమే చూస్తున్నారు, ఆ తర్వాత వచ్చే ఫన్ పార్ట్‌ను పట్టించుకోవట్లేదు. ఇంగ్లీషులో బూతులు నార్మల్ అయినప్పుడు, తెలుగులో అంటేనే ఎందుకీ సమస్య? అంటూ సూటిగా ప్రశ్నించారు.
దర్శకుడు భాను భోగవరపు కూడా, పాటలోని భాష పల్లెటూరి జాతరల నేపథ్యం నుంచి వచ్చిందని, కావాలనే కొందరు తమ సినిమాను టార్గెట్ చేస్తున్నారని గట్టిగా చెప్పారు.
ఈ వివాదం సినిమాలోని మాస్ కంటెంట్‌కి కొత్త మసాలా అద్దినట్టయింది.
గతంలో ఆగస్టు 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, పలు కారణాల వల్ల వాయిదా పడి, ఇప్పుడు అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. రవితేజ కెరీర్‌లో ఈ ‘మాస్ జాతర’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!


