మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా 75వ చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 27న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.ఈమేరకు ఓ పోస్టర్ విడుదల చేశారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక యూత్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. 2022లో వచ్చిన ‘ధమాకా’ మూవీలో రవితేజ, శ్రీలీల జోడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
