Raviteja Ole Ole Lyric Video Review: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘మాస్ జాతర’ (Mass Jathara). భాను బోగవరపు దర్శకత్వంలో ఈ లేటెస్ట్ మూవీ రూపొందుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో లక్ష్మణ్ భేరి అనే పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓలే ఓలే అని సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చి గాత్రదానం చేసిన ఈ పాట ఇప్పుడు మిక్స్ డ్ రియాక్షన్స్ ను అందుకుటోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురౌతోంది.
నీ అమ్మ.. అక్క..
ఈ పాటలో నీ అమ్మ.. అక్క.. తల్లి.. చెల్లిని.. పట్టుకుని.. ఉంట నీ అమ్మ కాడా, తింటా నీ అమ్మ కాడా.. నీ దగ్గర పంట.. వంటి పదాలు ఉన్నాయి. రచిత భాస్కర్ యాదవ్ దాసరి జానపద పాటకు లిరిక్స్ అందించారు. దీంతో పాటపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బూతులు ధ్వనించేలా ఉన్నాయని.. ఆ పదాలు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి. ఇదే సమయంలో మాస్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఈ పాట రాశారని మరికొందరు అంటున్నారు. జానపదంలో ఇలాంటి పదజాలం సహజమేనని చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/ntr-on-esquire-photo-made-key-comments-on-family-cinema-legacy/
రెండో సినిమా కావడం..
కాగా, టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా ఇది రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ – శ్రీ లీల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం.


