Saturday, November 15, 2025
HomeTop StoriesRaviteja: మాస్ మహారాజాకు ఫ్లాపులతో పనిలేదు.. అదే పంథాలో!

Raviteja: మాస్ మహారాజాకు ఫ్లాపులతో పనిలేదు.. అదే పంథాలో!

Raviteja: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్స్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత మాస్ రాజా ర‌వితేజ గురించే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎప్పుడూ గత సినిమా ప్రభావం పడదు. ముందు రెండు సినిమాలు ఫ్లాపైనా, కొత్త సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. రవితేజ సినిమాకి ఇలాగే జరుగుతుంది. ఆయన క‌థానాయ‌కుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమ‌ల దర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఈ సినిమా పక్కా కిషోర్ తిరుమల మార్క్ క్లాసిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోంది. ర‌వితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే త‌న‌దైన క్లాసిక్ మూవీగా కిషోర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి హైద‌రాబాద్ పరిసర ప్రాంతాలలోనే జరుగుతోంది. కొన్ని సీన్స్ మాత్రం ఇత‌ర రాష్ట్రాల్లో షూట్ చేసారు. ఇక, తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో కంప్లీట్ అయింది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్‌కి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ షెడ్యూల్‌ని స్పెయిన్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Also Read- Katrina Kaif: త‌ల్లి కాబోతున్న ‘మ‌ల్లీశ్వ‌రీ’ హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోల‌తో గుడ్‌న్యూస్

రవితేజ, కిషోర్ తిరుమల సినిమా కొత్త షెడ్యూల్‌ని అక్టోబ‌ర్ మొదటి వారం నుంచి స్పెయిన్‌లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ని దాదాపు నెల రోజుల పాటు ప్లాన్ చేశారట. హీరో ర‌వితేజతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనబోతున్నారట. అలాగే, ర‌వితేజ‌-హీరోయిన్ ల‌పై కూడా సాంగ్స్ ని షూట్ చేయనున్నారు. అందుకే, స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ కి ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ మూవీలో ర‌వితేజ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు.

త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల ‘ధ‌మాకా’ అనే కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ని చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకూ రవితేజ కి స‌రైన హిట్ పడలేదు. ఆయన చేసిన సినిమాలు అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డ‌టం అభిమానులను బాగా డిజప్పాయింట్ చేస్తున్నాయి. అయినా, ర‌వితేజ మాత్రం తన పంథాలోనే సినిమాలను చేస్తూ వస్తున్నారు. మధ్యలో మెగాస్టార్‌తో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా ఒకటి హిట్ సాధించింది. కాగా, ప్ర‌స్తుతం కిషోర్ తిరుమల సినిమాతో పాటు, భాను బోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో ‘మాస్ జాత‌ర’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్. త్వరలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Bigg Boss Nominations: లత్కోర్ పనులు నేను చేయను.. హరీష్, డీమాన్ మధ్య హీటెక్కించిన గొడవ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad