Ravi Teja: సినీ పరిశ్రమలో హిట్టు కొట్టిన హీరోలకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హిట్స్‌లో ఉన్న హీరోల చుట్టే ఇండస్ట్రీ తిరుగుతుంది. సక్సెసులు అందుకున్న హీరోలనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. కానీ రవితేజ కెరీర్ అందుకు భిన్నంగా సాగుతోంది. రవితేజ హిట్టు అందుకొని మూడేళ్లు దాటింది. ధమాకా తర్వాత రవితేజ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ కాన్సెప్ట్ పరంగా పర్వాలేదనిపించినా కమర్షియల్‌గా మాత్రం సేఫ్ కాలేకపోయాయి. మిస్టర్ బచ్చన్, రావణాసుర ఔట్ అండ్ ఔట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి.
ఈ ఫెయిల్యూర్స్ రవితేజ కెరీర్‌పై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. ప్రస్తుతం ఐదు సినిమాలను లైన్‌లో పెట్టాడు రవితేజ. మరో రెండేళ్ల వరకు అతడి డేట్స్ ఖాళీగా లేవట. రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న (రేపు) థియేటర్లలోకి రాబోతుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహించాడు. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందింది. ఆగస్ట్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వార్ 2 ఫెయిల్యూర్‌తో పాటు కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడింది.
Also Read- Suriya: మరో తెలుగు దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సూర్య – దిల్‌రాజు బ్యానర్‌లో మూవీ
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫన్ ఫ్యామిలీ డ్రామా సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. సంక్రాంతికి రవితేజ, కిషోర్ తిరుమల మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కేథికా శర్మ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌తో ఓ సినిమాను అంగీకరించాడు రవితేజ. ఇప్పటికే స్క్రిప్ట్ లాకయ్యింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ మూవీ సెట్స్‌పైకి రాబోతుందట. అలాగే రవితేజ, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ డిస్కషన్స్‌లో ఉంది. ఈ ఇద్దరు హీరోల మూవీకి బెజవాడ ప్రసన్నకుమార్ కథను అందించబోతున్నాడు.
Also Read- The Girlfriend: రష్మికకు అసలైన పరీక్ష – లేడీ ఓరియెంటెడ్ మూవీతో హిట్టు కొడుతుందా?
ఇవే కాకుండా బింబిసార, విశ్వంభర చిత్రాల దర్శకుడు వశిష్ట మల్లిడితో రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. రవితేజ గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ పాయింట్‌తో ఈ మూవీ ఉండబోతున్నట్లు చెబుతున్నారు. విశ్వంభర రిలీజ్ తర్వాతే ఈ సినిమా మొదలుకానున్నట్లు టాక్.


