నటుడు, మాస్టర్ భరత్‌కు(Master Bharath) మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి చెన్నైలో నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తల్లి అకాల మరణంతో భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అలాగే భరత్‌కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. కాగా భరత్ బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. వెంకీ, రెడీ, కింగ్, అందాలరాముడు, యముడికి మొగుడు, బాద్‌షా తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Master Bharath: మాస్టర్ భరత్‌కు మాతృవియోగం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES