Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభIlaiyaraaja: మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇళయరాజా షాక్.. రూ.5 కోట్లు డిమాండ్

Ilaiyaraaja: మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇళయరాజా షాక్.. రూ.5 కోట్లు డిమాండ్

Ilaiyaraaja – Mythri Movie Makers: భారతీయ సినీ చరిత్రలో సంగీత మాస్ట్రోగా పేరుగాంచిన ఇళయరాజా గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. అద్భుతమైన సంగీతంలో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు అదే సంగీతం కారణంగా కాంట్రవర్సీల్లోకి అడుగు పెడుతున్నారు. ఎనిమిది పదుల వయసులో ఆయనకు ఇదంతా అవసరమా? అని అనేవాళ్లు లేకపోలేదు. ఆయన అయితే ఎవరేం అనుకున్నా.. నా పంథా నాదేనంటున్నారు మ్యాస్ట్రో మ్యూజిషియన్.

- Advertisement -

ఇళయరాజా పాటలు ఎంత ఫేమస్సో చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఆయన పాటలను సినిమాల్లో పలు సందర్భాల్లో బ్యాగ్రౌండ్ లో వాడుకునేవాళ్లు. కానీ ఈ మధ్య అలా కుదరటం లేదు. తన పర్మిషన్ లేకుండా తన పాటలను, బీజీఎంను ఉపయోగించుకుంటే ఇళయరాజా సదరు మేకర్స్‌పై కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇప్పుడు అలాంటి సందర్భమే ఆయనకు మరోసారి వచ్చింది. వివరాల్లోకెళ్లే.. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) నటించిన ‘గుడ్ అండ్ అగ్లీ (Good Bad Ugly)’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని మన తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పుడు మ్యాస్ట్రో మైత్రీ మూవీ మేకర్స్‌పై కేసు నమోదు చేశారు. తన అనుమతి లేకుండా, తాను కంపోజ్ చేసిన పాటలను ఈ సినిమాలో ఉపయోగించుకున్నారని ఇళయరాజా ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో తెలిపారు.

Also Read – Revanth Reddy on Teachers day: టీచర్లు బాగా పని చేస్తే మళ్లీ సీఎం అవుతా

థియేటర్లలోకి వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఊహించని విధంగా 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అయితే, ఈ చిత్రంలో తన అనుమతి లేకుండా కొన్ని పాటలను వాడారని ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. ఇళయరాజా కంపోజ్ చేసిన పాత పాటలను ఈ సినిమాలో వాడారని ఆరోపిస్తూ, ఆయన రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ సినిమా నుంచి ఆ పాటలను ఏడు రోజుల లోపు పూర్తిగా తొలగించాలని కూడా ఆయన తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను పలు సినిమాల్లో నిరంతరం ఉపయోగించడాన్ని నిషేధించాలని ఇప్పటివరకు ఉపయోగించుకున్నవారు తగిన పరిహారం చెల్లించాలని కూడా ఆయన కోరారు.

ఈ కేసు సెప్టెంబర్ 8న విచారణకు రానుంది. గతంలో కూడా ఇలాంటి కాపీరైట్ కేసులు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేవి. ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు ఇతర భాషల నుంచి పాటలను కాపీ కొడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తానికి, ఇళయరాజా – మైత్రి మూవీ మేకర్స్ మధ్య జరుగుతున్న ఈ వివాదం సినిమా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Also Read – Pushpa 3: బ‌న్నీ ఫ్యాన్స్‌కు పండ‌గే.. పుష్ప 3 కూడా ఉంద‌ట.. క‌న్ఫామ్ చేసిన సుకుమార్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad