Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభMatka Moive: మట్కా.. 'రామా టాకీస్' ర్యాంప్ సాంగ్ వచ్చేసింది

Matka Moive: మట్కా.. ‘రామా టాకీస్’ ర్యాంప్ సాంగ్ వచ్చేసింది

Matka Moive| వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా పలాస డైరెక్టర్ కె.కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘మట్కా’ (Matka). తాజాగా చిత్ర బృందం మూవీలోని ‘రామా టాకీస్‌’ ర్యాంప్ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. భవానీ రాకేశ్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు దర్శకుడు కరుణ కుమార్‌ సాహిత్యం అందించాడు. ఇక ఈ పాటను సాయిదేవ్‌ హర్ష పాడారు. ఈ మేకింగ్ వీడియో ఆద్యంతం అలరించేలా ఉంది. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

కాగా ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విడుదల చేసిన సంగతి తెలిసిందే. 1960-80ల మధ్య కాలంలో దేశంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో వరుణ్‌ నాలుగు భిన్నమైన గెటప్పుల్లో కనువిందు చేయనున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు, వరుణ్‌ తేజ్‌ డైలాగులు సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడిని కాదు. వాసుని మట్కా కింగుని’, ‘నీలాంటి మంచోళ్ల వల్ల టైమ్‌కి వర్షాలు పడుతున్నాయి. పంటలు పండుతున్నాయి. కానీ నాలాంటి చెడ్డోళ్ల వల్ల ఓ పదిమంది కడుపులు నిండుతున్నాయి. నేచర్‌ బ్యాలెన్స్‌’ అంటూ వరుణ్‌ చెప్పిన డైలాగ్‌లు మెప్పించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad