Telugu Webseries: గతంలో వెబ్‌సిరీస్‌లు అంటే ఆడియెన్స్‌లో చిన్న చూపు ఉండేది. స్టార్ డమ్ లేని చిన్న యాక్టర్స్ మాత్రమే వీటిలో నటించేవారు. కానీ ఇప్పుడు సీన్, సిట్యూవేషన్ రెండు మారాయి. అగ్ర హీరోహీరోయిన్లు సైతం సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్‌లలో భాగమవుతున్నారు. కథ పరిధి ఎక్కువగా ఉండటం, నిడివి సమస్య… ఇలా కారణాలు ఏవైనా సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని కథలు చెప్పడానికి స్కోప్ ఉండదు. అలాంటి డిఫరెంట్ స్టోరీస్‌ను వెబ్‌సిరీస్‌ల ద్వారా ఇంట్రెస్టింగ్‌గా చెబుతూ ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. తెలుగులో ఈ వెబ్ సిరీస్ కల్చర్ బాగా పెరిగింది. ఆగస్ట్ నెలలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో రూపొందిన కొన్ని వెబ్‌సిరీస్‌లు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సిరీస్‌లు ఏవంటే?
మయసభ…
తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ మయసభ సోనీలివ్ ఓటీటీలో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మలుపు తిప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత సీఏం వైఎస్‌రాజశేఖర్ రెడ్డి జీవితాల్లో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. కిరణ్ జయకుమార్‌తో కలిసి డైరెక్టర్ దేవా కట్టా మయసభ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్యరావు, దివ్య దత్తా, బిగ్‌బాస్ దివితో పాటు పలువురు టాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి గా చైతన్య రావు, ఐరావతి బసు క్యారెక్టర్‌లో దివ్య దత్తా కనిపించబోతున్నారు.
మోతెవరి లవ్‌స్టోరీ…
మై విలేజ్ షో ద్వారా ఫేమస్ అయిన యూట్యూబర్ అనిల్ గీలా ప్రధాన పాత్రలో మోతెవరి లవ్‌స్టోరీతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓ వెబ్‌సిరీస్ రూపొందింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఆగస్ట్ 8న జీ5 ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సిరీస్‌లో అనిల్ గీలాకు జోడీగా వర్షిణి నటిస్తోంది. మురళీధర్ గౌడ్, సదానందం కీలక పాత్రల్లో నటిస్తున్న శివ కృష్ణ బుర్రా డైరెక్టర్.
Also Read – Vivo T4R 5G: 50MP కెమెరా, 5700mAh బ్యాటరీ, 6.77 అంగుళాల డిస్‌ప్లేతో వివో నయా ఫోన్..
అరేబియా కడలి..
కింగ్డమ్ మూవీ తర్వాత ఓ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సత్యదేవ్. అరేబియా కడలి పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ను ఆగస్ట్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. చేపల వేట కోసం వెళ్లి అంతర్జాతీయ సముద్ర జలాలు దాటిన కొందరు మత్య్సకారులు విదేశీ జైలులో ఎలా బంధీలుగా మారారు అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు డైరెక్టర్ క్రిష్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ సిరీస్‌లో ఆనంది, నాజర్, హర్ష్ రోషన్ కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు.
కానిస్టేబుల్ కనకం..
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ తెలుగు వెబ్ సిరీస్‌లో వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రాజీవ్ కనకాల మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్‌కు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు.
రాంబో ఇన్ లవ్…
రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందిన రాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అభినవ్, భార్గవ్ రెడ్డి, పవన్ యాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సట్టముమ్ నీతియుమ్ వెబ్ సిరీస్ ఆగస్ట్ 1 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
Also Read – Actor Srinivasan: వెయ్యి కోట్ల రుణం పేరుతో రూ.5 కోట్లు వసూలు చేసిన నటుడు అరెస్ట్


