యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’ (Mazaka). ఈ సినిమాలో రీతూ వర్మ.. సందీప్ సరసన నటించారు. ఇక ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు, రావు రమేశ్, మురళీశర్మ, రఘుబాబు, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. మహాశివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను నవ్వించింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓటీటీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో థియేటర్‌లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేందుకు సిద్ధమయ్యారు.