Meenakshi Chaudhary: తెలుగులో ఇప్పుడు కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ఒకరు. ఈ బ్యూటీ నటించిన సినిమాలు యావరేజ్, హిట్ సినిమాలుగా నిలిచాయి. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో సెకండ్ లీడ్‌గా కనిపించింది. ఈ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి ఒక్క సాంగ్ లేకపోయినా, మీనాక్షి పర్ఫార్మెన్స్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత మీనాక్షి తమిళంలో ‘గోట్’ అనే సినిమాను, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాను చేసింది.
తమిళంలో నటించిన మొదటి సినిమా ‘గోట్’ బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ ఎలా ఉన్నా, గ్రాండ్ ఎంట్రీ మాత్రం బాగానే పేరు తెచ్చిపెట్టింది. ఇందులో మీనాక్షి పర్ఫార్మెన్స్ కి, సాంగ్స్ లో కనిపించిన గ్లామర్ కి తమిళ తంబీలు ఫిదా అయ్యారు. అయితే, ‘గోట్’ తర్వాత మళ్ళీ తమిళంలో ఛాన్స్ ఏది రాలేదు. ఇక ‘లక్కీ భాస్కర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ ని సాధించింది. ఇందులో గృహిణిగా నటించిన మీనాక్షి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉంటాయో…తన పర్ఫార్మెన్స్ తో చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
ఇక, విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’.. మీనూకి బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన ఈ మూవీకి 300 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, చాలా ఇంపార్టెంట్ రోల్ చేసి తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత భారీ చిత్రాలు, పెద్ద స్టార్స్ నటించే సినిమాలలో అవకాశాలు వస్తాయని భావించారు. కానీ, ఎందుకనో ప్రస్తుతం మీనాక్షి తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించే అవకాశం దక్కింది. అది కూడా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన ‘అగనగనగా ఒకరాజు’ సినిమాలో.
‘అనగనగా ఒకరాజు’ 2026, సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్ రిలీజైంది. కంప్లీట్ ఫన్ అండ్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. అయితే, తాజా సమాచారం మేరకు మీనాక్షి చౌదరి ముంబై ఫ్లైటెక్కబోతుందట. బాలీవుడ్ సీనియర్ హీరో జాన్అబ్రహం హీరోగా రాబోతున్న ‘ఫోర్స్ 3’లో హీరోయిన్‌గా మీనాక్షిని ఫైనల్ చేసుకున్నట్టుగా లేటెస్ట్ బాలీవుడ్ మీడియా న్యూస్. భావ్ ధూలియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, నవంబర్ నుంచి సెట్స్‌పైకి రానుంది. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే, కీర్తి సురేశ్, సమంత, శ్రీలీల, రష్మిక మందన్నలా మీనాక్షి కూడా బాలీవుడ్‌లో సెటిలవుతుందనుకోవచ్చు. చూడాలి మరి మీనూకి హిందీ ఇండస్ట్రీ ఎంతవరకూ కలిసివస్తుందో.
Also Read- Deepika Padukone: ప్రభాస్‌కు హ్యాండిచ్చి…. హాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్న దీపికా పదుకొనె


