Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMeenakshi Chaudhary: హర్ట్ అయ్యా.. టాలీవుడ్ కి గుడ్ బై..

Meenakshi Chaudhary: హర్ట్ అయ్యా.. టాలీవుడ్ కి గుడ్ బై..

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి.. హాట్ బ్యూటీగా బాగా ట్రెండ్ అవుతున్న హీరోయిన్. వరుస హిట్స్ తో సౌత్ లో బాగా బిజీగా ఉన్న హీరోయిన్ కూడా. ఈ బ్యూటీ ఒకేసారి 4-5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. మీనూ నటించిన ఈ సినిమాలన్ని పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో సౌత్ లో బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కువగా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నటించిన అమ్మడు, తమిళంలోనూ నటించి హాట్ టాపిక్ అయింది. అక్కడ థలపతి విజయ్ సరసన నటించిన గోట్ సినిమా హిట్ కాకపోయినా మీనాక్షికి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

- Advertisement -

మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఆ సినిమా అనగనగా ఒకరోజు. ఇందులో హీరో నవీన్ పోలిశెట్టి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సీనియర్, మిడ్ రేంజ్ హీరోలతో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్యూటీ. వాళ్ళకి మంచి జోడీ కూడా. దీనికి ఉదాహరణ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం.. విజయ్ ది గోట్.. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ లాంటి సినిమాలే.

Also Read – Ilaiyaraaja: మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇళయరాజా షాక్.. రూ.5 కోట్లు డిమాండ్

ఇవే కాదు, విశ్వక్ సేన్.. నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ హీరోలకి మంచి జోడీ మీనాక్షి. కానీ, ఆశించినంతగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల కోలీవుడ్ హీరో ధనుష్ సరసన ఓ సినిమా చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. కానీ, ఇంకా అఫీషియల్ గా దీనికి చెందిన ప్రకటన మాత్రం రాలేదు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న రష్మిక మందన్న, కీర్తి సురేశ్, నయనతార, శ్రీలీల, సాయి పల్లవి లాంటి వారు బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్నారు.

మరీ ముఖ్యంగా హిందీలో రష్మిక ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ఈ లిస్ట్ లో మీనాక్షి కూడా చేరిందని బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి.. బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ గురించి రివీల్ చేసింది. హిట్ ఫ్రాంచైజీ లో మూడో భాగంగా ప్లాన్ చేస్తోన్న ‘ఫోర్స్’ మూవీ కోసం మీనాని అడిగారట. ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో జాన్ అబ్రహం హీరో. విపుల్ అమృత్‌లాల్ షా, జాన్ అబ్రహం కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో అధికారికంగా ప్రకటన రానున్నట్టు సమాచారం. చూడాలి మరి హిందీలో మీనూ పాప ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో.

Also Read – Keerthy Suresh: లాయ‌ర్‌గా కీర్తి సురేష్ – మ‌హాన‌టి హీరోయిన్ నెక్స్ట్‌ మూవీపై అప్‌డేట్ ఇదే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad