NC24: నాగచైతన్య హీరోగా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ప్రారంభమై ఆరేడు నెలలు అవుతున్న ఇప్పటివరకు హీరోయిన్ ఎవరన్నది అఫీషియల్‌గా మేకర్స్ ప్రకటించలేదు. ఈ సినిమాలో గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. త్వరలోనే మీనాక్షి ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నవంబర్ సెకండ్ వీక్‌లో మొదలయ్యే నెక్స్ట్ షెడ్యూల్‌లో నాగచైతన్య, మీనాక్షి చౌదరితో పాటు వైవా హర్ష, జయరాంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు కార్తీక్ దండు ప్లాన్ చేస్తున్నారట. మీనాక్షి చౌదరి స్పెషల్ పోస్టర్‌ను మరికొద్ది రోజుల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ఈ మిథికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ఇప్పటివరకు యాభై శాతం వరకు పూర్తయ్యిందట. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న 24వ సినిమా ఇది. ఈ మిథికల్ థ్రిల్లర్‌కు కాంతార చాప్టర్ వన్ ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read- Surender Reddy: ఇద్దరి హీరోల మధ్యలో చిక్కుకున్న సురేందర్ రెడ్డి!
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది మీనాక్షి చౌదరి. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత అక్కినేని హీరోతో రొమాన్స్ చేయబోతుంది. గత ఏడాది టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి హవా కొనసాగింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో గుంటూరు కారంలో మహేష్‌బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌తో బ్లాక్‌బస్టర్ అందుకుంది. మట్కా, మెకానిక్ రాఖీ మాత్రం మీనాక్షికి నిరాశనే మిగిల్చాయి. తమిళంలో దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్‌లో కథానాయికగా కనిపించింది. గత ఏడాది ఆరు సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు ఒకే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
2025లో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజులో హీరోయిన్‌గా నటిస్తోంది మీనాక్షి చౌదరి.
Also Read- Garuda Puranam: వెళ్లేది స్వర్గానికో..నరకానికో…గరుడ పురాణం ద్వారా ఇలా తెలుసుకోవచ్చు..!


