Meesala Pilla Song: భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు, పోట్లాటలు ఎప్పుడూ ఉండేవే. భర్త మీద అలిగిన భార్యను బుజ్జగించటానికి భర్త పడే పాట్లు ఎలా ఉంటాయి. భర్త చేసిన తప్పులను భార్య ఎత్తి చూపితే తన పరిస్థితేంటి? అదేంటో తెలుసుకోవాలంటే ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఈ సరదా గొడవలను పాట రూపంలో వినేస్తూ సన్నివేశాల రూపంలో చూసేయండి అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా జనవరి 9న సందడి చేయనుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న అనీల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Also Read – TG Vishwaprasad: డబ్బులు తీసుకొని..? ది రాజాసాబ్ పై సెన్షేషనల్ కామెంట్స్..
సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమోకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన లిరికల్ సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. పాటను వింటే చిరంజీవి చేసిన తప్పు వల్ల.. నయనతార అతన్నుంచి విడిపోతుంది. చాన్నాళ్లకు ఇద్దరూ కలుసుకుంటారు. మన హీరో ఏమో భార్యతో ప్యాచప్ కోసం తాపత్రయపడుతుంటాడు. కానీ ఆమె ఏమో పట్టించుకోదు. ఆ గొడవేంటి? చివరకు భార్యాభర్తలు ఎలా కలిశారనేదే కథ.
‘మీసాల పిల్ల’ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాయగా.. ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. చాలా కాలం తర్వాత మళ్లీ చిరంజీవికి ఉదిత్ పాట పాడారు. హీరో వెంకటేష్ ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తుండటంతో ఇద్దరి అభిమానులు తమ హీరోలను సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్‌గా నిలిచిన అనీల్ రావిపూడి తన సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ వచ్చే సంక్రాంతికి రాబోతున్నారు. ఈ మూవీలో చిరంజీవి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వింటేజ్ చిరంజీవితో సెన్సేషన్ క్రియేట్ చేయటానికి అనీల్ సిద్ధమవుతున్నారు.
Also Read – Balagam Venu and DSP: ‘బలగం’ వేణు డైరెక్షన్‌లో దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఏమైనట్టు..?


