Mega Fans: టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే ఫ్రేమ్‌లో సిల్వర్‌స్క్రీన్‌పై చూడాలనే అభిమానుల కల మెగా 157 మూవీతో నెరవేరబోతుంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మెగా 157లో వెంకటేష్‌ది గెస్ట్ రోల్ అయినా స్క్రీన్ టైమ్ మాత్రం 20 నిమిషాలపైనే ఉంటుందని అంటున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయని సమాచారం.
నెక్స్ట్ లెవెల్‌లో…
ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కనిపించే సీన్స్ విషయంలో డైరెక్టర్ అనిల్‌రావిపూడి ఎక్స్‌ట్రా కేర్ తీసుకున్నట్లు తెలిసింది. చిరంజీవి, వెంకటేష్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా ఈ ట్రాక్ సిద్దం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వెంకటేష్ మెగా 157 మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు చెబుతోన్నారు. మెగా 157 మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. రిలీజ్‌కు మరో ఆరు నెలలు ఉండగానే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయినట్లు సమాచారం.
Also Read – Foxconn : చైనా ఇంజినీర్లు వెనక్కి.. భారత్ ఐఫోన్ తయారీపై ఎఫెక్ట్
పవన్ సినిమాలో….
కాగా మెగా ఫ్యామిలీ హీరోల మూవీలో వెంకటేష్ గెస్ట్‌గా కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీలో ఓ ఫైట్ సీన్‌లో వెంకటేష్ నటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి మూవీ 2018 సంక్రాంతికి రిలీజైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
అజ్ఞాతవాసి సెంటిమెంట్…
మెగా 157లో వెంకటేష్ గెస్ట్‌గా నటించడం, సంక్రాంతికే ఈ మూవీ రిలీజ్ అవుతుండటం కో ఇన్సిడెన్స్ అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. అజ్ఞాతవాసి సెంటిమెంట్‌ను మెగా 157 బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నది ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్‌పైనే మెగా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్‌లో అపజయమే లేని డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి కొనసాగుతోన్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన అన్ని సినిమాలు కమర్షియల్‌గా పెద్ద హిట్టయ్యాయి. అదే సక్సెస్ జోష్ మెగా 157 తోనూ అనిల్ రావిపూడి కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు.
Also Read – Jupally Krishna Rao: కల్తీ కల్లు బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి జూపల్లి
విశ్వంభర రిలీజ్…
మెగా 157 కంటే ముందే చిరంజీవి విశ్వంభర రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిజల్ట్ కూడా కొంత వరకు మెగా 157పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న విశ్వంభర మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది. మెగా 157లో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా…విశ్వంభరలో త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా కనిపించబోతున్నారు.


