Mega Hero: మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఎఫ్ 3 తర్వాత వరుణ్‌తేజ్‌కు సరైన హిట్టు లేదు. ప్రయోగాల పేరుతో ఈ మెగా హీరో చేసిన సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయి. ప్రొడ్యూసర్లకు దారుణంగా నష్టాలు మిగిల్చాయి. ఈ ఫెయిల్యూర్స్ కారణంగా తన నెక్స్ట్ సినిమాను రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేయాలని వరుణ్‌తేజ్ ఫిక్సైనట్లు ప్రచారం జరుగుతోంది.
మైత్రీ బ్యానర్‌లో…
వరుణ్‌తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చాలా రోజుల క్రితమే ఓ సినిమా ఫైనల్ అయ్యింది. ఏఐ టెక్నాలజీ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీగా సాగనున్న ఈ సినిమాకు టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట. డిసెంబర్ నుంచి విక్రమ్ సిరికొండ మూవీ కోసం వరుణ్ తేజ్ డేట్స్ కేటాయించినట్లు చెబుతున్నారు.
బడ్జెట్ ఎక్కువే…
వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అంశాలతో ముడిపడిన కాన్సెప్ట్ కావడంతో బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువే అవుతోందట. వరుణ్‌తేజ్ మార్కెట్‌కు మించి ఖర్చు చేయాల్సివస్తుందని టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ లిమిట్ దాటడంతో రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో ఈ సినిమాలో నటించాలని వరుణ్‌తేజ్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వరుణ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గత సినిమాల రిజల్ట్ కూడా ఓ కారణమని అంటున్నారు. ఈ ప్రాఫిట్ షేరింగ్ విధానంలో సినిమా హిట్టయితే వరుణ్‌తేజ్‌కు డబ్బులు వస్తాయి. రిజల్ట్ అటు ఇటు అయినా ఒక్క రూపాయి కూడా దక్కదు. కాగా వరుణ్‌తేజ్, విక్రమ్ సిరికొండ మూవీ షూటింగ్ చాలా వరకు అమెరికాలోనే జరుగనుందట. డిసెంబర్‌లోనే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేయనున్నారు.
కొరియన్ కనకరాజు…
ప్రస్తుతం కొరియన్ కనకరాజు షూటింగ్‌తో వరుణ్‌తేజ్ బిజీగా ఉన్నాడు. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌ను డిసైడ్ చేయబోతుంది. వచ్చే ఏడాది వేసవిలో కొరియన్ కనకరాజు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొరియన్ కనకరాజు వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న పదిహేనవ సినిమా కావడం గమనార్హం.
Also Read- Ram Gopal Varma: హిందువులపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు… పోలీస్ కేసు నమోదు


