Chiru-Charan: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలకి ఓ హిస్టరీ ఉంది. ఇది మెగాస్టార్ చిరంజీవితో మొదలై, మెగా మేనల్లుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన “ఉప్పెన” వైష్ణవ్ తేజ్ వరకూ కొనసాగుతూనే ఉంది. మెగా హీరో సినిమా ఏది వచ్చినా అటు ప్రేక్షకుల్లో ఇటు ఫ్యాన్స్ లో ఓవరాల్‌గా ఇండస్ట్రీ వర్గాలలో ఉండే అంచనాలు నెక్స్ట్ లెవల్.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డుల కోసం వేచి చూస్తుంటారు. డాన్స్ కి మెగా హీరోలు పెట్టింది పేరు. చిరు తర్వాత ఆయన తనయుడు చరణ్ ఎలాంటి కష్టమైన స్టెప్ ని కూడా చాలా ఈజీగా చేస్తూ అందరినీ షాక్కు గురి చేస్తున్నారు. ఇటీవల పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ చికిరి రిలీజైన సంగతి తెలిసిందే.
Also Read – Rakul Preet Singh: చీరలో చెమటలు పట్టిస్తున్న రకుల్
ఈ పాటలో చరణ్ వేసిన హుక్ స్టెప్ ఒక్కో ప్రేక్షకుడు వెయ్యి సార్లు చూసేలా డాన్స్ మాస్టర్ జానీ కంపోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అంతకముందు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకరవరప్రసాద్‌గారు సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల స్లో పాయిజన్‌లా ఎక్కేసింది. ఈ సాంగ్ వచ్చాక సోషల్ మీడియాలో ఎన్ని లక్షల మంది ఈ సాంగ్ ని అనుసరిస్తూ డాన్స్ చేశారో చెప్పలేము.
అలాగే, ఇప్పుడు వచ్చిన చరణ్-బుచ్చిబాబుల పెద్ది సినిమాలోని చికిరి పాట హుక్ స్టెప్స్ ని సినీ లవర్స్ తెగ ఫాలో అవుతూ పేరడీ చేస్తున్నారు. ఇక ఈ రెండు పాటలు ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలోని మీసాల పిల్ల సాంగ్ 50 మిలియన్స్ వ్యూస్ ని రాబట్టడం విశేషం కాగా, పెద్ది లోని చికిరి సాంగ్ 4 భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ ని రాబట్టి దూసుకుపోతోంది. ఇక ఈ సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ ని రాబట్టడం రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. ఇలాంటి రికార్డులు మెగా హీరోలకి కొత్త కాకపోయినా, సినీ లవర్స్ కి ఇండస్ట్రీ వర్గాలకి మాత్రం కొత్తే అని చెప్పాలి.
Also Read – Ananya Panday: బోల్డ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న అనన్య పాండే


