Mega Heroes: మెగా హీరోల టైమ్ అస్సలు బాగాలేదు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో డిజప్పాయింట్ చేస్తున్నారు. సీనియర్స్‌తో పాటు యంగ్ హీరోలది అదే పరిస్థితి. రీసెంట్‌గా వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా ఈ డిజాస్టర్స్ లిస్ట్‌లో చేరిపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ యాభై శాతం మేరకు మాత్రమే రికవరీ సాధించింది. నిర్మాతకు హరిహర వీరమల్లు సినిమా అరవై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.
రెమ్యూనరేషన్ లేకుండా…
పవన్ కళ్యాణ్ కూడా రెమ్యూనరేషన్ లేకుండా హరిహర వీరమల్లు చేశాడు. సినిమా హిట్టయితేనే తనకు రెమ్యూనరేషన్ ఇవ్వమని నిర్మాతకు చెప్పానని ప్రమోషన్స్‌లో అన్నాడు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండి కూడా హరిహరవీరమల్లు ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. అతడి కష్టం వృథాగా మారడం తప్ప హరిహర వీరమల్లుతో పవన్‌కు ఒరిగిందేమీ లేదు. హరిహరవీరమల్లు కంటే ముందు పవన్ కళ్యాణ్ చేసిన బ్రో మూవీ కూడా పరాజయాన్నే చవిచూసింది.
Also Read- Dhanush Mrunal Dating: ధనుష్ తో మృణాల్ ప్రేమాయణం.. ఇదెక్కడి విడ్డూరమబ్బా..!
భోళా శంకర్ దెబ్బ…
బ్రో ఫ్లాప్ ఎఫెక్ట్ నుంచి ఫ్యాన్స్ బయటపడకముందే అదే ఏడాది భోళా శంకర్‌తో మరో ఎదురు దెబ్బ తగిలింది. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పట్టుమని ఒక్క వారం కూడా థియేటర్లలో నిలవలేకపోయింది.
వంద కోట్ల నష్టాలు…
హరిహర వీరమల్లు కంటే ముందు ఈ ఏడాది రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. శంకర్ దర్శకత్వంలో దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 200 కోట్లలోపే వసూళ్లను దక్కించుకున్నది. ఈ ఏడాది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఫస్ట్ డే నుంచే గేమ్ ఛేంజర్‌కు నెగెటివ్ టాక్ రావడం మొదలైంది. దిల్‌రాజుకు ఈ సినిమా వంద కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు వార్తలొచ్చాయి.
వరుణ్ తేజ్…
మెగా హీరో వరుణ్‌తేజ్ రెండేళ్లలో మూడు ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో అతడు చేసిన గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్‌తో పాటు మట్కా నిర్మాతలను నిండా ముంచేశాయి. సినిమాల కోసం పెట్టిన బడ్జెట్‌లో పావువంతు కూడా రాబట్టలేకపోయాయి. దాంతో వరుణ్‌తేజ్‌తో సినిమా అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి నెలకొంది.
ఆదికేశవ…
ఉప్పెన మూవీతో తొలి సినిమాతోనే వంద కోట్లు కొట్టిన మరో మెగా యంగ్ హీరో వైష్ణవ్ వరుస ఫ్లాపులతో సైలెంట్ అయ్యాడు. ఆదికేశవ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. దాదాపు తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మాస్ యాక్షన్ మూవీ మూడు కోట్ల లోపే వసూళ్లను రాబట్టి డిజప్పాయింట్ చేసింది.
Also Read- Kamal Haasan : కమల్ హాసన్… సనాతన సంకెళ్లు తెంచే ఆయుధం చదువే!
ఓజీపైనే ఆశలన్నీ…
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆశలు మొత్తం పవన్ కళ్యాణ్ ఓజీపైనే ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల రిలీజైన ఫస్ట్ సింగిల్‌తో ఓజీపై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. మెగా హీరోల ఫ్లాప్‌లకు ఓజీతో పుల్‌స్టాప్ పడటం ఖాయమని అభిమానులు చెబుతోన్నారు. ఓజీతో పాటు రానున్న ఐదు నెలల్లో చిరంజీవి విశ్వంభర, మెగా 157 సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.


