Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభChiranjeevi : కిష్కింధ‌పురి చిత్రాన్ని అభినందించిన మెగాస్టార్‌.. రీజ‌న్ ఏంటంటే!

Chiranjeevi : కిష్కింధ‌పురి చిత్రాన్ని అభినందించిన మెగాస్టార్‌.. రీజ‌న్ ఏంటంటే!

Chiranjeevi: మంచి చిత్రాల‌ను అభినందించ‌టానికి ముందే హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) ఒక‌రు. తాజాగా ఆయ‌న బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన కిష్కింధ‌పురి సినిమాను అభినందించారు. షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి (Sahu Garapati) ఈ సినిమాను నిర్మించారు. పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ సెప్టెంబ‌ర్ 12న (Kishkindhapuri Release date) థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో ముందుకెళుతోన్న ఈ మూవీపై ఇప్పుడు చిరంజీవి స్పంద‌న నెట్టింట వైర‌ల్ అవుతోంది. ప్రీమియ‌ర్ టాక్ షోస్ సాలిడ్ ఓపెనింగ్స్‌తో సినిమా అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది.

- Advertisement -

‘నా సినిమా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమాను నిర్మించిన సాహు గార‌పాటి నిర్మించిన మ‌రో సినిమా కిష్కింధ‌పురి మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. సినిమా నాకు మంచి ప్ర‌య‌త్నం చేశార‌నిపించింది. సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌న‌లు’ అని చిరంజీవి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

Also Read – Manchu Lakshmi: ఇంటి అద్దె క‌ట్ట‌డానికి ఇబ్బందులు ప‌డుతున్నా – మంచు ల‌క్ష్మి కామెంట్స్‌

హార‌ర్ క‌థ‌తో పాటు మంచి సైకాల‌జిక‌ల్ పాయింట్‌ను కిష్కింధ‌పురి మూవీలో ప్ర‌స్తావించారు. మ‌నిషి ఒంట‌రిత‌నం వ‌ల్ల వ‌చ్చే ప‌రిణామాల‌ను చాలా చ‌క్క‌గా చిత్రీక‌రించారు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. సాయి శ్రీనివాస్, అనుప‌మ కాంబోలో రెండో మూవీ హిట్ సాధించ‌టం విశేషం. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి (Kaushik Pegallapati) సినిమాను తెర‌కెక్కించాడు.

తొలి నాలుగు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ (Kishkindhapuri Collections) సాధించింది. షేర్ వ‌సూళ్ల పరంగా రూ. 6.33 కోట్లు సంపాదించుకుంది. మొత్తంగా చూస్తే సినిమాకు రూ. 11.30 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. షేర్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా చూస్తే రూ. 7.53 కోట్లు సంపాదించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. బిజినెస్ ప‌రంగా రూ. 9.50 కోట్లు జరుపుకుంది. ప‌ది కోట్ల రూపాయ‌లు వ‌స్తే సినిమా సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి.

ఆరేళ్ల త‌ర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వ‌చ్చిన హిట్ ఇది. రాక్ష‌సుడు (Rakshasudu) త‌ర్వాత ఈ యంగ్ హీరో ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ సాలిడ్ హిట్ ద‌క్కించుకోలేదు. ఇన్నేళ్ల‌కు మ‌రో హిట్ రావ‌టంతో హీరోకి స‌రికొత్త ఎన‌ర్జీనిచ్చింద‌నే చెప్పాలి. టిల్లు స్క్వేర్ (Tillu Square) త‌ర్వాత అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) కి కూడా మ‌రో హిట్ వ‌చ్చింది.

Also Read – Disha Patani: కాల్పులు ఘటన.. ఎవరినీ వదలిపెట్టం.. దిశా పటానీకి ముఖ్యమంత్రి సపోర్ట్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad