Chiranjeevi: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో సెలిబ్రిటీల కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ సెలిబ్రిటీల పేరు ప్రతిష్టలు దిగజార్చేలా కొందరు వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోల బాధితులలో రష్మిక మందన్న, రజనీకాంత్‌తో పాటు చాలా మంది సెలిబ్రిటీలే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారట. చిరంజీవి గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్ క్రియేట్ చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారట. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు సమాచారం. అటు తిరిగి ఇటు తిరిగి చిరంజీవి కంట పడినట్లు తెలిసింది. అశ్లీల కంటెంట్‌పై చిరంజీవి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఈ అశ్లీల కంటెంట్‌తో తన పేరు ప్రతిష్టలు దిగజార్చుతున్న వారిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు చిరంజీవి కంప్లైంట్ చేసినట్లు తెలిసింది. ఏఐ కంటెంట్ దుర్వినియోగంపై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా కొందరు వ్యక్తిగత వాణిజ్య అవసరాల కోసం తన పేరు, వాయిస్ ఫొటోలను వాడుకుంటున్నారని పిటీషన్‌లో చిరంజీవి పేర్కొన్నారు. మెగాస్టార్, చిరు వంటి పేర్లను వాడుకుంటున్నారని, ఇందులో యూట్యూబ్ ఛానెల్లు, ఆన్‌లైన్ మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా వంటివి ఉన్నాయని చిరంజీవి పిటీషన్‌లో వెల్లడించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు చిరంజీవి విన్నవించారు.
Also Read – Anu emmanuel: అను బేబికి రీ ఎంట్రీ అయినా కలిసొస్తుందా?
చిరంజీవి పిటీషన్‌ను విచారించిన కోర్టు ఆయన అనుమతి లేకుండా ఫొటోలను, వాయిస్‌ను ఉపయోగించడానికి వీలులేదంటూ తీర్పు ఇచ్చింది. వాయిస్ క్లోనింగ్, ఏఐ డీప్ ఫేక్ వంటి వాటికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు సూచించింది. ప్రస్తుతం అశ్లీల వీడియోలపై పోలీసుల విచారణ కొనసాగుతోన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతుంది. విశ్వంభర మూవీ సమ్మర్‌లో థియేటర్లలోకి రాబోతుంది. వాల్తేర్ వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీతో మరో సినిమా చేయబోతున్నాడు.
Also Read – Mannara Chopra: ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న మన్నారా..


