Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMega Star: 2026లో మెగాస్టార్ చిరంజీవి త్రిబుల్ ధమాకా!

Mega Star: 2026లో మెగాస్టార్ చిరంజీవి త్రిబుల్ ధమాకా!

Mega Lineup: మెగాస్టార్ చిరంజీవిని స్క్రీన్ మీద చూసి అభిమానులకు చాలా రోజులైంది. అయితే, 2026 సంవత్సరం మెగా అభిమానులకు నిజంగానే త్రిబుల్ బొనాంజా అని చెప్పాలి. వరుసగా మూడు భారీ సినిమాలు ఒకే ఇయర్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ఉన్న జోష్, ఆయన ఎంచుకున్న ప్రాజెక్టుల లైనప్ చూస్తే 2026 మెగాస్టార్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

- Advertisement -

1. సంక్రాంతి క్లాస్: ‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి జనవరిలో విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’ తరహాలో పక్కా మాస్, ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్‌తో ఈ సినిమా కథ ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా మెయిన్ గా భార్యాభర్తల చుట్టూ, 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామాతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కూడా ఓ క్యామియోలో కనిపించనున్నాడు. చిరంజీవి అసలు పేరునే టైటిల్‌గా పెట్టడం ఫ్యాన్స్‌కి మరింత ఉత్సాహాన్నిస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/mass-jathara-delay-reason-war-2-trolling-producer-naga-vamsi/

2. సమ్మర్ ఫాంటసీ: ‘విశ్వంభర’ 2026 వేసవికి రిలీజ్ కాబోతుంది.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఒక సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వైబ్ ని గుర్తుకు తెచ్చేలా ఉండే ఈ సినిమా గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నందున, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీని వేసవికి వాయిదా వేశారు. ఈ చిత్రం చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు.

3. ఇయర్ ఎండింగ్ మాస్ జాతర: బాబీ కాంబో 2026 డిసెంబర్ చివరిలో విడుదల కానుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ కాంబోను రిపీట్ చేస్తూ దర్శకుడు బాబీ కొల్లి తో చిరంజీవి మరో సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించారు. ఈ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆశిస్తారు. అందుకే 2026 సంవత్సరాన్ని మాస్ యాక్షన్ తో ముగించడానికి ఈ సినిమా తెరకెక్కుతుంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-fauji-kannada-actress-chaitra-j-achar-cast-update/

మొత్తం మీద, 2026లో చిరంజీవి అభిమానులకు జనవరిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, వేసవిలో సోషియో ఫాంటసీ, ఏడాది చివర్లో పక్కా మాస్ యాక్షన్ సినిమాతో మురిపించడానికి మెగాస్టార్ రెడీ అవుతున్నారు. ఈ లైనప్ చూస్తుంటే 2026 ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మెగా ఫెస్టివల్ చూడటం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad