Sunday, December 8, 2024
Homeచిత్ర ప్రభChiranjeevi: 'లక్కీ భాస్కర్‌'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: ‘లక్కీ భాస్కర్‌’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi| మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dhulkar Salman) హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar). దీపావళి కానుకగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పటికే ఈ మూవీపై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

ఈ సినిమా తనకెంతో నచ్చడంతో దర్శకుడు వెంకీ అట్లూరిని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. మూవీ మేకింగ్‌, చిత్రబృందం పనితీరును మెచ్చుకున్నారు. చిరంజీవి తమ వర్క్‌ను అభినందించారని చెబుతూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పోస్ట్ చేసింది. ‘‘మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మీ సినిమా చూసి.. వర్క్‌ని అభినందిస్తే.. మీరు ప్రత్యేకంగా ఏదో సృష్టించారని తెలుస్తోంది’’ అని రాసుకొచ్చింది.

కాగా బ్యాంకింగ్ సెక్టార్, స్టాక్ మార్కెట్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే రూ.70కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News