Badla Ganesh: తెలుగు నిర్మాత బండ్ల గణేష్ మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా బయటకు చెప్పేస్తుంటారు. కొన్నిసార్లు ఈ మనస్తత్వం ఆయనకు ఇబ్బందులను కూడా తెచ్చి పెట్టింది. అయినా కూడా తన పంథాను ఆయన విడిచి పెట్టలేదు. ఇప్పుడు నటుడిగా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్న ఆయన అడపా దడపా కొన్ని ఈవెంట్స్‌కు మాత్రం హాజరవుతున్నారు. దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ఆయన ప్రతీ ఏడాది తను కాల్చబోయే బాణాసంచా ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం అలా లేదు. రూట్ మార్చాడు. ఏకంగా భారీ వేడుకను నిర్వహించాడు. దాదాపు సినీ ఇండస్ట్రీ అంతా ఈ వేడుకకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా ప్రముఖ దర్శకులు, నిర్మాతలు అందరూ బండ్ల గణేష్ దీపావళి పార్టీకి హాజరయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో అభిమానించే గణేష్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్య అతిథిగా ఆయన్ని ఆహ్వానించారు. రాగానే చిరంజీవి కాళ్లపై పడి ఆయనకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కుర్చీలో కూర్చో పెట్టాడు. దానికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు కనిపించటం లేదు. అంటే వాళ్లని బండ్ల గణేష్ ఆహ్వానించలేదా? లేక ఆహ్వానిస్తే వీళ్లే వెళ్లలేదా అనేది తెలియటం లేదు.
Also Read – Rashmika Mandanna: తగ్గేదేలే అంటోన్న రష్మిక – థామా కోసం హీరోతో సమానంగా రెమ్యూనరేషన్!
నిజానికి మెగా, అల్లు ఫ్యామిలీస్‌తో క్లోజ్‌గా ఉండే గణేష్.. రీసెంట్‌గా జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌లో పనంతా మరొకరు చేస్తే.. చివరలో వచ్చి అల్లు అరవింద్ పేరు కొట్టేస్తాడంటూ అల్లు అరవింద్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి. దీనికి బన్నీ వాసు కూడా గణేష్‌కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కూడా. దీని వల్లే అల్లు ఫ్యామిలీ రాలేదా? అనే డిస్కషన్ అయితే బాగానే నడుస్తోంది. ఏదైతేనేం ప్రస్తుతానికి బండ్ల గణేష్ ఇచ్చిన గ్రాండ్ దీపావళి పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ROYALTY 😎💥🔥🦁
Boss raa bachasss 💥🔥@KChiruTweets #Chiranjeevi pic.twitter.com/fs00K0QERE
— We Love Chiranjeevi (@WeLoveMegastar) October 18, 2025
Also Read – Railway Notification : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్


