Chiranjeevi: చిరంజీవి…టాలీవుడ్‌కు బిగ్‌బాస్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టేవారందరికి చిరంజీవినే స్ఫూర్తి. సహాయనటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి మెగాస్టార్‌గా అవతరించారు. 47 ఏళ్ల కెరీర్‌లో చిరంజీవి చూడని హిట్టు లేదు. సాధించని రికార్డు లేదు. వెండితెరపైనే కాకుండా నిజజీవితంలో ఎంతో మంది సాయం చేసి రియల్ హీరోగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తెలుగు తెరపై తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొందిన చిరంజీవి బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేశాడు. అక్కడ విజయాలను అందుకున్నాడు.
ప్రతిబంధ్‌తో…
టాలీవుడ్‌లో హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న టైమ్‌లోనే ప్రతిబంధ్ మూవీతో హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అంకుశం మూవీకి రీమేక్‌గా ప్రతిబంధ్ రూపొందింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీలో జాహీ చావ్లా హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో హీరోగా హిట్టు అందుకున్నారు చిరంజీవి. మాస్ రోల్‌లో చిరంజీవి నటనకు బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
గ్యాంగ్‌లీడర్ రీమేక్…
ప్రతిబంధ్ తర్వాత తెలుగులో తాను హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ గ్యాంగ్ లీడర్‌ను ఆజ్ కా గూండరాజ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు చిరంజీవి. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టినే దర్శకత్వం వహించాడు. ఈ బాలీవుడ్ మూవీలోని పాటలు మాత్రం పెద్ద హిట్టయ్యాయి. ఆజ్ కా గూండరాజ్‌లో చిరంజీవికి జోడీగా మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా కనిపించింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
శంకర్ జెంటిల్‌మెన్ హిందీలో…
శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా నటించిన తమిళ మూవీ జెంటిల్‌మెన్ బాలీవుడ్ రీమేక్‌లో చిరంజీవి హీరోగా నటించాడు. ది జెంటిల్‌మెన్ పేరుతో తెరకెక్కిన ఈ రీమేక్ మూవీకి అగ్ర దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ది జెంటిల్‌మెన్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు మూవీకి ఏఆర్ రెహమాన్, అను మాలిక్ మ్యూజిక్ అందించారు. జూహీ చావ్లా హీరోయిన్‌గా నటించింది. ది జెంటిల్‌మెన్ ఫ్లాప్‌తో బాలీవుడ్ సినిమాలకు దూరమయ్యారు చిరంజీవి. ఇదే చిరంజీవి చేసిన చివరి బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ అగ్ర దర్శకుల సినిమాల్లో అవకాశాలు వచ్చినా తెలుగులో బిజీగా ఉండటంతో వాటిని రిజెక్ట్ చేశారు.
బాలీవుడ్‌లోనే కాకుండా తమిళం, కన్నడంలో చిరంజీవి స్ట్రెయిట్ సినిమాలు చేశారు. కన్నడంలో చిరంజీవి నటించిన శ్రీ మంజునాథ, సిపాయి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తమిళంలో రజనీకాంత్‌తో రణువవీరన్, మాప్పిళ్లై సినిమాలు చేశారు చిరంజీవి. దిగ్గజ దర్శకుడు కే బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన 47 నాట్కాల్ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించారు. ఈ సినిమాతోనే యాక్టర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.
Also Read- Priyanka Jawalkar: చీరకట్టులో కనికట్టు చేస్తున్న తెలుగమ్మాయి


