OG Pre Release Event: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న OG (Original Gangster) చిత్రం సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujith) దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య (DVV Danayya) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకు ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. దసరా (Dasara) కానుకగా రానున్న ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో (OG Overseas Bookings) దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోవడం సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో చెప్పేస్తుంది.
OG రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఈ నెల 19న విజయవాడలో (Vijayawada) ఆ తర్వాత 21న హైదరాబాద్‌లో (Hyderabad) భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లలో హైలైట్ ఏమిటంటే హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే మెగా అభిమానులకు నిజంగా డబుల్ ఫెస్టివల్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఒకే వేదికపై కనిపించి చాలాకాలం అయిన నేపథ్యంలో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read – SYG – Sambarala Yeti Gattu: గాసిప్స్ సాయి దుర్గ తేజ్ చెక్.. ‘సంబరాల ఏటిగట్టు’ రీ స్టార్ట్ అయ్యేదెప్పుడంటే!
‘ఓజీ’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు, అంతేకాకుండా ఆయన డ్యూయల్ రోల్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ (Thaman) సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ (పవన్ బర్త్‌డే సందర్భంగా విడుదలైనది), టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇవి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ‘ఓజీ’, ‘ఓజీ’ అంటూ అభిమానులు తెగ హల్‌చల్ చేస్తున్నారు.
OG అంచనాల జోరు చూస్తుంటే సినిమా మామూలుగా ఉండదని స్పష్టమవుతోంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు వాటిని అందుకోలేక ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే, మేకర్స్ సంతోషంగా ఉన్నా మరో కోణంలో అంచనాలను అందుకోగలమా అనే చిన్న ఆందోళనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘హరిహర వీరమల్లు’తో అభిమానులను నిరాశపరిచిన పవన్ కళ్యాణ్, ‘ఓజీ’తో ఒక అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సుజీత్ ఈ అంచనాలను ఎలా అందుకుంటారో చూడాలి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read – Thama Release Updates: సోలోగా సై అంటోన్న రష్మిక మందన్న


