Vishwambhara Release date: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జోనర్‌లో సినిమా తెరకెక్కుతోంది. మెగాభిమానులు ఈ సినిమా రాక కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర గ్రాఫిక్స్, ఇతరత్రా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సినిమా ఔట్‌పుట్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నారు. బింబిసార మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన దర్శకుడు వశిష్ట తన రెండో చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ డేట్ మారిన తర్వాత కొత్త రిలీజ్ డేట్‌పై ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా, ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా ఆగస్ట్ 21న విశ్వంభర రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర మూవీ నుంచి ఓ చిన్న వీడియో విడుదల చేశారు. అందులో చిరంజీవి మాట్లాడారు. విశ్వంభర సినిమా ఆలస్యానికి గల కారణాలను అందులో ఆయన వివరించారు. సినిమా సెకండాఫ్ అంతా గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుంది కాబట్టి.. బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వటానికి దర్శక నిర్మాతలు కష్టపడుతున్నారని, అందుకే ఆలస్యమవుతుందని ఆయన తెలిపారు. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపై కూడా ఆయన మాట్లాడుతూ డేట్ రివీల్ చేయకుండా వచ్చే ఏడాది సమ్మర్‌లో విశ్వంభరను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొన్ని రోజులు నుంచి చాలా వార్తలే వినిపిస్తూ వచ్చాయి. అయితే ఆ వార్తలకు ఇప్పుడు టీమ్ చెక్ పెట్టింది. సినిమా దసరా, దీపావళికి విడుదల కాబోవటం లేదు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఔట్‌పుట్ కోసం సమయం పట్టేలా ఉండటంతో మేకర్స్ సినిమా విడుదల ఆలస్యమైనా పరావాలేదని భావిస్తున్నారు. ఈ మూవీతో పాటు అనీల్ రావిపూడితో చిరంజీవి చేస్తోన్న మరో సినిమా, బాబీ దర్శకత్వంలో చేయబోతున్న కొత్త సినిమా అప్‌డేట్స్‌ను కూడా చిరంజీవి బర్త్ డే సందర్భంగా తెలియజేయబోతున్నారు.
మెగా `157 ఫస్ట్ లుక్…
తెలుగు ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉన్న సినిమాల్లో మెగా 157 ఒకటి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను చిరంజీవి బర్త్‌డే రోజు రివీల్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మన శంకర్‌ప్రసాద్‌గారు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. మెగా 157 మూవీలో క్లాస్, మాస్ కలబోతగా సాగే క్యారెక్టర్‌లో చిరంజీవి కనిపించబోతున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలతో కలిసి సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ap-police-arrested-vyooham-producer-dasari-kiran/
బాబీ దర్శకత్వంలో మరోసారి..
వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. ఈ సినిమాను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు తెలిసింది. ఈ భారీ బడ్జెట్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోన్నట్లు తెలిసింది. ఈ మూడు అప్‌డేట్స్‌తో పాటు అదే రోజు చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ స్టాలిన్ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.


