Mehreen Pirzada: హ్యాట్రిక్ హిట్స్‌తో టాలీవుడ్‌లో మెహరీన్ ఫిర్జాదా కెరీర్ మొదలైంది. నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ పంజాబీ బ్యూటీ. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ విజయాలతో లక్కీ స్టార్‌గా మారింది మెహరీన్. ఎంత త్వరగా టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యిందో, అంతే ఫాస్ట్‌గా మెహరీన్ కెరీర్ డౌన్ అయ్యింది. వరుస డిజాస్టర్స్‌తో టాలీవుడ్‌కు దూరమైంది. 2023లో రిలీజైన స్పార్క్ లైఫ్ తర్వాత మెహరీన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు.
ఇంద్రతో రీఎంట్రీ….
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తమిళ మూవీ ఇంద్రతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఇంద్ర మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంద్ర మూవీలో వసంత్ రవి హీరోగా నటించాడు. టాలీవుడ్ కమెడియన్ సునీల్‌తో పాటు అనైక సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. సబరీష్ నందా దర్శకత్వం వహించాడు. ఇంద్ర మూవీ ఓటీటీలో తెలుగులోనూ రిలీజ్ కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెలాఖరు నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read- Mirai Movie: బై వన్ గెట్ వన్ ఫ్రీ – రిలీజైన రెండో రోజే ‘మిరాయ్’ మేకర్స్ ఆఫర్
ఐఎమ్‌డీబీలో…
డిఫరెంట్ ప్రమోషన్స్‌తో ఇంద్ర మూవీ తమిళ ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్, టీజర్స్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో కనిపించలేకపోవడంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఐఎమ్‌డీబీలో మాత్రం ఈ సినిమా 9.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
సునీల్ విలన్…
ఈ కోలీవుడ్ మూవీలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ విలన్‌గా నటించాడు. తన భార్యను చంపిన సీరియల్ కిల్లర్‌ను అంధుడైన మాజీ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు అనే పాయింట్‌తో ఇంద్ర మూవీ రూపొందింది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న థ్రిల్లింగ్ చెప్పడంలో దర్శకుడు తడబడిపోయాడనే విమర్శలు వచ్చాయి.
రజనీకాంత్ జైలర్‌లో…
ఇంద్రలో హీరోగా నటించిన వసంత్ రవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. జైలర్‌లో రజనీకాంత్ కొడుకుగా నటించాడు. అశ్విన్, తారామణి వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు.


