Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMichael: మైఖేల్ జాక్సన్ బయోపిక్.. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు హీరో!

Michael: మైఖేల్ జాక్సన్ బయోపిక్.. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు హీరో!

MICHAEL: సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ప్రపంచం మొత్తం మీద పేరు తెచ్చుకున్న ఒకేఒక్క సెలబ్రిటీ మైఖేల్ జాక్సన్. కింగ్ ఆఫ్ పాప్‌గా ఆయనకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు వింటున్న ఫాలోయింగ్, క్రేజ్ ఇవ్వన్నీ మైఖేల్ జాక్సన్ తోనే మొదలయ్యాయి.
2009లో మైఖేల్ మరణించిన తర్వాత ప్రపంచమంతా విషాదంలో మునిగిపోయింది. అయితే, ఇప్పుడు వస్తున్న బయోపిక్ ట్రెండ్‌లో, మైఖేల్ జీవిత కథను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ ఎదురుచూపులకు తెరపడింది. ‘మైఖేల్’ పేరుతో ఆయన బయోపిక్ మన ముందుకు రాబోతోంది!

- Advertisement -

ఈ బయోపిక్‌లో మైఖేల్ జాక్సన్ పాత్రను పోషిస్తున్నది ఎవరో కాదు… జాఫర్ జాక్సన్! జాఫర్ మరెవరో కాదు, మైఖేల్ జాక్సన్ సొంత మేనల్లుడు! రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లింప్స్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు నిజంగా మైఖేల్ జాక్సనే మళ్లీ తిరిగి వచ్చారా అనిపిస్తోంది. జాఫర్ తన స్టైల్, గ్రేస్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మైఖేల్ లాగానే కనిపించడంతో… ఈ సినిమా కోసం మూవీ టీమ్ జాఫర్ ను ఎంచుకోవడం సరైన నిర్ణయం అని అందరూ అంటున్నారు. జాఫర్ నటన, డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు!

ALSO READ: SSMB29: పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌తో హైప్ డబుల్ చేసిన రాజమౌళి!

మైఖేల్ జాక్సన్ జీవిత కథతో వస్తున్న ఈ బయోపిక్… విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా భారీ రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ చిన్న గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు పీక్స్‌కి చేరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదల చేయబోతున్నారు. మైఖేల్ లాంటి లెజెండ్ జీవిత కథ వెండితెరపైకి వస్తుందంటే.. ఆ రోజు కోసం ప్రపంచంలో కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad