Mirai vs Kishkindhapuri: శుక్రవారం తేజా సజ్జా మిరాయ్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి థియేటర్లలో రిలీజయ్యాయి. మిరాయ్ మైథలాజికల్ అంశాలతో సాగే సూపర్ హీరో మూవీ కాగా… కిష్కిందపురి హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. రెండు సినిమాలకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. మిరాయ్ మూవీలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అదిరిపోయాయని అంటున్నారు. కిష్కిందపురి హారర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టిందని చెబుతున్నారు. కాగా ఈ రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫిక్సయ్యాయి.
జియో హాట్ స్టార్‌లో…
తేజా సజ్జా మిరాయ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నది. ఐదు భాషలకు కలిపి నలభై ఐదు కోట్లకు ఈ డీల్ సెట్టయినట్లు సమాచారం. ఆరు వారాల గ్యాప్ తర్వాత మిరాయ్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటివారంలో ఈ సూపర్ హీరో మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Today gold rates: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు..!
మంచు మనోజ్ విలన్…
మిరాయ్ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శ్రియా, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ డైరెక్టర్లు కిషోర్ తిరుమల వెంకటేష్ మహా గెస్ట్ రోల్స్ చేశారు.
ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించారు. క్లైమాక్స్‌లో శ్రీరాముడి సీన్లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. తొలిరోజు మిరాయ్ మూవీ 24 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్ట్రీమింగ్ అప్పుడే…
కిష్కిందపురి ఓటీటీ రైట్స్ కూడా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అమ్ముడుపోయాయి. ఈ హారర్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అక్టోబర్ సెకండ్ వీక్‌లో కిష్కిందపురి జీ5 లో విడుదలయ్యే అవకాశం ఉందట. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
Also Read – YSR Sharmila: నా కొడుకే వైఎస్ఆర్ అసలైన వారసుడు.. షర్మిల షాకింగ్ కామెంట్స్


