Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMirai OTT Release: నెల తిరక్క ముందే ఓటీటీలోకి ‘మిరాయ్’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Mirai OTT Release: నెల తిరక్క ముందే ఓటీటీలోకి ‘మిరాయ్’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Mirai OTT Release: తేజ సజ్జా, మంచు మనోజ్‌ నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘మిరాయ్’ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. జియో హాట్‌స్టార్‌ వేదికగా అక్టోబర్‌ 10 నుంచి మిరాయ్ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులు దీన్ని చూడవచ్చు. ‘మిరాయ్‌’ కథలో పురాణ గాథలు, దైవశక్తులు, ఆధునిక సాహసాలు కలిసిన ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. సామ్రాట్‌ అశోక్‌ కాలం నాటి దైవశక్తి, తొమ్మిది గ్రంథాలు, వాటి రక్షకులు, మానవ లోభం మధ్య జరిగే యుద్ధం ఈ కథకు ప్రధాన ఆకర్షణ. మంచు మనోజ్‌ మహావీర్‌ లామా పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు.

- Advertisement -

Read Also: IND VS AUS: రో-కో వచ్చేస్తున్నారోచ్.. ఆస్ట్రేలియాతో వన్డేలకు జట్టు ఎంపిక ఇవాళే..!

టాలీవుడ్ లో టాప్ కలెక్షన్లు

మరోవైపు హీరో తేజ సజ్జా తన ఎనర్జీ, ఎమోషనల్‌ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ‘హనుమాన్‌’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన తేజ.. ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌, విజువల్‌ గ్రాఫిక్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ డిజైన్‌ స్థాయిని చూసి ప్రేక్షకులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందని కామెంట్లు చేశారు.

Read Also: Health Benefits: రోజూ ఉదయాన్నే యాపిల్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఇక, థియేట్రికల్‌ రన్‌లో ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం 2025లో టాలీవుడ్‌ టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ చిత్రం మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తయినా ఇప్పటికీ చాలా ఏరియాల్లో స్ట్రాంగ్‌గా నడుస్తోంది. అయితే, ఇంత మంచి హిట్ సాధించిన ఈ చిత్రం నెల రోజులు తిరగకముందే ఓటీటీలోకి వస్తుండటం నిజంగానే షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా.. ఓటీటీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఓటీటీలో రిలీజ్ చేయకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే మ్యాజిక్‌ రిపీట్ చేస్తుందా? లేదా? అన్నది మరికొన్ని రోజులు వేచి చూస్తే తెలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad