Tg Vishwa Prasad,: తేజా సజ్జా హీరోగా నటించిన మిరాయ్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోంది. నాలుగు రోజుల్లో 91 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మంగళవారం నాటితో ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కలెక్షన్స్ పరంగా మిరాయ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. మూడు మిలియన్ల వసూళ్లను దక్కించుకున్నది.
మిరాయ్ మూవీ సక్సెస్ మీట్‌ను మంగళవారం విజయవాడలో నిర్వహించారు. ఈ వేడుకలో హీరో తేజా సజ్జాతోపాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనిలకు స్పెషల్ గిఫ్ట్‌లను అనౌన్స్ చేశారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. లగ్జరీ కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తేజా సజ్జా, కార్తీక్… ఏ కార్లను సెలెక్ట్ చేసుకున్నా వాటిని కొనిస్తానని స్టేజ్‌పైనే ప్రకటించారు. నిర్మాత వారికి రేంజ్ రోవర్ కార్లను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కో కారు ఖరీదు కోటిపైనే ఉండొచ్చని సమాచారం.
రెమ్యూనరేషన్ తీసుకోకుండా…
కాగా మిరాయ్ మూవీకి ఎలాంటి ముందస్తు రెమ్యూనరేషన్ తీసుకోకుండా మిరాయ్ మూవీలో తేజా సజ్జా నటించాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ను కూడా సినిమా మేకింగ్ కోసమే ఖర్చు పెట్టమని నిర్మాతతో తేజా సజ్జా చెప్పినట్లు తాను విన్నానని బాబీ అన్నారు. తేజా సజ్జా డెడికేషన్, సినిమా కోసం పడిన మూడేళ్ల కష్టం అతడికి సక్సెస్‌ను తెచ్చిపెట్టిందని బాబీ పేర్కొన్నారు.
Also Read – GOVT EMPLOYEES: జీవో 317 బాధితులకు ఊరట.. మూడేళ్ల డిప్యుటేషన్‌కు ప్రభుత్వం పచ్చజెండా!
మంచు మనోజ్ విలన్…
లాంగ్ గ్యాప్ తర్వాత మిరాయ్‌తోనే నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ సక్సెస్‌ను అందుకున్నారు. మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ అడ్వెంచర్ మూవీగా కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కించారు. మిరాయ్‌లో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు.
రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శ్రియా, జగపతిబాబు, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. హరి గౌర మ్యూజిక్ అందించాడు. మిరాయ్ కాన్సెప్ట్‌తో పాటు గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయని ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. హనుమాన్ తర్వాత మిరాయ్‌తో హీరోగా పెద్ద హిట్‌ను అందుకున్నాడు తేజా సజ్జా.
Also Read – PM Modi: 75వ వడిలోకి అడుగుపెట్టిన మోదీ.. హీరాబెన్‌కు ఎన్నో సంతానమో తెలుసా!


