Mirai Sequel: మిరాయ్ మూవీతో హీరోగా సెకండ్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు తేజ సజ్జా. బ్యాక్ టూ బ్యాక్ వంద కోట్ల సినిమాలతో టైర్ 2 లిస్ట్‌లోకి చేరిపోయాడు. మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన మిరాయ్ ఫస్ట్ వీక్‌లో 112 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 50 కోట్లకుపైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఓవర్‌సీస్‌లో ఇరవై ఐదు కోట్లు (2.8 మిలియన్ల) వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో మిరాయ్ రెండు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టాప్ బ్యానర్లు…
మిరాయ్ సక్సెస్‌తో తేజ సజ్జాకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. అతడితో నెక్స్ట్ సినిమా చేసేందుకు టాప్ బ్యానర్లు అడ్వాన్సులతో రెడీగా ఉన్నట్లు సమాచారం. మిరాయ్ తర్వాత తేజ సజ్జా మిరాయ్ సీక్వెల్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్ టైటిల్ ఖరారైంది.
మిరాయ్ సీక్వెల్…
మిరాయ్ జైత్రయ పేరుతో సీక్వెల్ తెరకెక్కనున్నట్లు తేజ సజ్జా వెల్లడించారు. మిరాయ్‌కి మించి సీక్వెల్‌లో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా సర్‌ప్రైజ్‌లతో ఇన్‌స్పైరింగ్‌గా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సీక్వెల్ స్టోరీని రెడీ చేశాడు అని తేజా సజ్జా అన్నాడు. మిరాయ్ సీక్వెల్‌లో రానా దగ్గుబాటి విలన్‌గా నటించనున్నట్లు వస్తున్న వార్తలపై కూడా తేజా సజ్జా రియాక్ట్ అయ్యారు. మిరాయ్ జైత్రయ కథను ఇంకా ఎవరికి చెప్పలేదని, విలన్‌పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
Also Read – Chiranjeevi: చిరు, బాబీ సినిమా మొదలయ్యేది అప్పుడే – విలన్‌గా మంచు మనోజ్?
మూడు సినిమాలు…
మిరాయ్ సీక్వెల్‌తో పాటు ప్రశాంత్ వర్మతో జాంబీరెడ్డి 2, జై హనుమాన్ సినిమాలు చేస్తున్నట్లు తేజ సజ్జా పేర్కొన్నాడు. అయితే ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లడానికి టైమ్ పడుతుందని అన్నాడు. కాగా తేజ సజ్జా అంగీకరించిన ఈ మూడు సినిమాలు సీక్వెల్స్ కావడం గమనార్హం. మిరాయ్ 2తో పాటు జాంబీరెడ్డి 2 సినిమాలను టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నట్లు సమాచారం. జై హనుమాన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మిరాయ్ సక్సెస్‌తో తేజా సజ్జా తన రెమ్యూనరేషన్ పెంచాడట. రెండు కోట్ల నుంచి ఏకంగా పన్నెండు కోట్లకు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.
రితికా నాయక్ హీరోయిన్…
మిరాయ్ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శ్రియా, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. మిరాయ్ మూవీతో నిర్మాతగా లాంగ్ గ్యాప్ తర్వాత టీజీ విశ్వప్రసాద్‌కు పెద్ద హిట్ దక్కింది. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై గత ఏడాది విశ్వప్రసాద్ నిర్మించిన ఆరు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఆ ఫ్లాపులకు మిరాయ్‌తో బ్రేక్ పడింది.
Also Read – vastu tips: గోల్డ్ రింగ్ ఏ వేలికి పెట్టుకుంటే మంచి జరుగుతుందో తెలుసా?


