Mirai vs Kishkindapuri: ఈ శుక్రవారం మిరాయ్, కిష్కింధపురి సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. మిరాయ్ సూపర్ హీరో మూవీ కాగా, కిష్కింధపురి హారర్ కథాంశంతో తెరకెక్కింది. రెండు సినిమాల్లో డివోషనల్ అంశాలు ఉండబోతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
పోటాపోటీ…
మిరాయ్‌తో పాటు కిష్కింధపురి రెండు సినిమాలపై పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. పోటాపోటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న కిష్కింధపురి సోలోగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. సెప్టెంబర్ 5న రిలీజ్ కావాల్సిన మిరాయ్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే వల్ల సెప్టెంబర్ 12కు వాయిదా పడింది. తమను సంప్రదించకుండానే రిలీజ్ డేట్‌ను మార్చేశారంటూ మిరాయ్ మేకర్స్‌పై కిష్కింధపురి ప్రొడ్యూసర్ విమర్శలు గుప్పించారు. మిరాయ్ ఎఫెక్ట్ కిష్కింధపురి కలెక్షన్స్‌పై గట్టిగానే పడేలా కనిపిస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ పరంగా చూసుకుంటే కిష్కింధపురిపై మిరాయ్‌దే డామినేషన్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఈ సినిమా దూసుకుపోతుంది.
Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే?
38 కోట్లు…
ముందు నుంచి పాజిటివ్ టాక్ ఉండటం, టీజర్, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ రావడంతో మిరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. వరల్డ్ వైడ్‌గా 36.50 కోట్ల వరకు మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తేజా సజ్జా మూవీ రిలీజ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 27 కోట్లకు అమ్ముడుపోయాయి. నైజాంలో 10 కోట్లు, ఆంధ్రాలో 12 కోట్ల వరకు బిజినెస్ చేసింది. సినిమాపై ఉన్న బజ్ కారణంగా మొదటిరోజు ఇరవై కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
టార్గెట్ తక్కువే…
మరోవైపు కిష్కింధపురి తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తొమ్మిదిన్నర కోట్ల వరకు జరిగింది. పదిన్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కిష్కింధపురి రిలీజ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ ఏడు కోట్ల వరకు జరిగింది.
Also Read- Akhanda 2 OTT Rights: అఖండ 2 సరికొత్త రికార్డ్.. ఓటీటీ రైట్స్ ఎంతంటే!
రన్‌టైమ్ తక్కువే…
కిష్కింధపురి ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. హారర్ ఎలిమెంట్స్‌తో సినిమా భయపెడుతుందని, అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్‌తో అదరగొట్టిందనే కామెంట్స్ వచ్చాయి. రన్‌టైమ్ తక్కువ కావడం కూడా కిష్కింధపురికి ప్లస్ కాబోతుంది. ఈ సినిమా రెండు గంటల ఐదు నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజ్ కాబోతుండగా, మిరాయ్ రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల లెంగ్త్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిరాయ్‌లో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా మంచు మనోజ్ విలన్‌గా కనిపించబోతున్నాడు.


