సినిమా: మిత్ర మండలి
నటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా తదితరులు
బ్యానర్స్: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్, బెంచ్ మార్క్ స్టోరీ టెల్లర్స్
దర్శకత్వం: విజయేందర్.ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, విజేందర్ రెడ్డి తీగల, భానుప్రతాప్
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ ఎస్.జె
ఎడిటర్: కోదాటి పవన్
Mithra Mandali Review: చిన్న సినిమాలతో భారీ విజయాలను సాధించే నిర్మాతగా పేరు సంపాదించుకున్న బన్నీ వాస్ నుంచి వచ్చిన మరో సినిమా ‘మిత్ర మండలి’. ఇంతకు ముందు ఈయన నుంచి వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సూపర్ హిట్ అయ్యింది. దీంతో మిత్ర మండలి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగినట్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు మీరు వెంట్రుక పీకలేరు అంటూ నెగటివ్ ట్రోలర్స్‌పై ఫైర్ కావటం.. ఈ సినిమా నచ్చకపోతే నా నెక్ట్స్ సినిమా చూడకండి అని ప్రియదర్శి చెప్పటం.. ఇవన్నీ సినిమాపై హైప్ పెరగటానికి రీజన్ అయ్యాయి. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథ:
Mithra Mandali Review: జంగ్లీ పట్నంలో నలుగురు పని పాటా లేకుండా పోరంబోకుల్లా తిరిగే (ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా) నలుగురు కుర్రాళ్లుంటారు. ఆ ఊరిలో ఓ అగ్ర కులానికి పెద్ద నారాయణ (వీటీవీ గణేష్) కూతురు స్వేచ్ఛ (నిహారిక ఎన్.ఎం) ఈ నలుగురిలో ఒకడితో ప్రేమలో పడి పారిపోతుంది. కూతురు పారిపోయిందంటే పరువు పోతుందని భావించిన సదరు కుల పెద్ద ఎస్సై (వెన్నెల కిషోర్) సాయంతో వెతుకుతుంటాడు. ఇంతకీ స్వేచ్చ వల్ల ఈ నలుగురు కుర్రాళ్లు పడే ఇబ్బందులేంటి? వారిని నారాయణ ఏం చేశాడు? అనేదే సినిమా కథ.
Also Read- Fauji: ‘ఫౌజీ’ అప్డేట్ ఇచ్చేసిన డైరెక్టర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే
విశ్లేషణ:
Mithra Mandali Review: తెలుగు ప్రేక్షకులు యాక్షన్ సినిమాలను ఎలా ఆదరిస్తున్నారో.. కామెడీ సినిమాలను కూడా అదే రేంజ్‌లో అందలం ఎక్కిస్తున్నారు. జాతి రత్నాలు, లిటిల్ హార్ట్స్ ఇలా ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. అలాంటి సినిమానే ‘మిత్ర మండలి’. సినిమా ప్రారంభంలోనే దర్శకుడు కథలేని కథ అంటూ సినిమాను స్టార్ట్ చేయటంతోనే అర్థం చేసుకోవాలి. ఏదో కథ కోసం సినిమాకు రాకండి.. జస్ట్ ఫన్ కోసం రావాలని చెప్పకనే చెప్పేశాడని. కామెడీ సినిమా ఇలా ఉంటేనే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని లేదు. అయితే వాళ్లని కడుపుబ్బా నవ్వించేలా సన్నివేశాలను మలిచి కనెక్ట్ చేస్తే చాలు.. మిగతా సంగతి వాళ్లే చూసుకుంటారు. మిత్ర మండలి సినిమాలో అదే మిస్సయ్యింది. డైరెక్టర్ సినిమాను సెటైరికల్‌గా రాసుకున్నాడు కానీ.. కామెడీగా కాదు.
ఇండస్ట్రీలో ఇప్పుడున్న కమెడియన్స్ అందరూ దాదాపు ఇందులో కనిపించారు. సత్య మాత్రమే ఆడియెన్స్‌ను తనదైన నటనతో మెప్పించాడు.. నవ్వించాడు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా పాత్రలు కనెక్టింగ్‌గా లేవు. అందుకనే వారి పాత్రలు చేసిన కామెడీ ఏదీ వర్కవుట్ కాలేదు. నిహారిక ఎన్.ఎం అయితే లుక్స్ విషయంలోమరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వీటీవీ గణేష్ పాత్ర చేసిన కామెడీ కూడా గొప్పగా అనిపించలేదు.
Also Read- Konda Surekha: కొండా సురేఖకు రేవంత్ రెడ్డి మరో షాక్.. రికార్డులు అప్పగించాలని ఆదేశం!
సాంకేతికంగా చూస్తే దర్శకుడు విజయేందర్ సినిమాను సెటైరికల్‌గా రాసుకున్నాడు కానీ.. హాస్యంతో ఆడియెన్స్‌ను నవ్వించలేకపోయాడు. సినిమాలో కమెడియన్స్ ఎక్కువ కావటం కూడా మైనస్ అయ్యిందా! అంటూ దర్శకుడు హ్యాండిల్ చేయలేకపోయాడనే అనుకోవాలి. దర్శకుడు కథనం విషయంలో, పాత్రలను మలిచే విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సిందనిపించింది. ఆర్.ఆర్.ధృవన్ సంగీతం, నేపథ్య సంగీతం, సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అంతంత మాత్రమే. గ్రాఫిక్స్ విషయంలో పట్టించుకోలేదా అనిపిస్తుంది. కొన్నిచోట్ల గ్రీన్ మ్యాట్ సీన్స్ అని తెలిసిపోతాయి.


