Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMithra Mandali: ఓటీటీలోకి కొత్త వెర్షన్ తో 'మిత్ర మండలి' మూవీ!

Mithra Mandali: ఓటీటీలోకి కొత్త వెర్షన్ తో ‘మిత్ర మండలి’ మూవీ!

Priyadarshi: ‘మిత్ర మండలి’ సినిమా అక్టోబర్ 16న విడుదలైనప్పుడు ఎంత పెద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుందో మనమంతా చూశాం. ప్రియదర్శి, రాగ్ మయూర్, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, సత్య లాంటి చాలామంది కమెడియన్లు ఉన్నా కూడా, ఈ సినిమా థియేటర్లలో ఏమాత్రం సక్సెస్ కాలేకపోయింది. సరైన కథ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం..

- Advertisement -

ఓటీటీలోకి ‘బ్రాండ్ న్యూ వెర్షన్’

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. అది కూడా ఒక ‘బ్రాండ్ న్యూ వెర్షన్’ తో అని మూవీ టీమ్ చెబుతోంది. ఈ కొత్త వెర్షన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ నమ్మకంగా అంటోంది. కానీ, ప్రేక్షకులకు మాత్రం దీనిపై పెద్దగా నమ్మకం లేదు. నిజంగా ఆ కొత్త కట్ అంత బాగుంటే, అది థియేటర్లలోనే విడుదల చేస్తే బాగుండేది కదా, అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.

ALSO READ: Rahul: తాళిపై రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలు వైరల్!

ఓటీటీలో సెకండ్ ఛాన్స్ వర్కవుట్ అవుతుందా?

చాలా సినిమాలకు సెకండ్ ఛాన్స్ అనేది ఓటీటీ ద్వారానే వచ్చింది. థియేటర్ ప్రేక్షకులు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కన్యాకుమారి’, ‘ఇడ్లీ కొట్టు’ లాంటి సినిమాలు థియేటర్లలో నెగెటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నా, ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ కోవలోనే, మూవీ టీమ్ ఒక కొత్త కట్ వెర్షన్‌తో ‘మిత్ర మండలి’ని ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.

ALSO READ: Peddi: చికిరి చికిరి’ సాంగ్ అప్డేట్.. రెహమాన్ మ్యూజిక్, చరణ్ డాన్స్!

ఈ మూవీ నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలోనైనా కొంత మంచి రెస్పాన్స్ రావాలంటే, సినిమాలో కొంచెమైనా కొత్తదనం ఉండాలి, లేదా కనీసం కథ అయినా ఉండాలి. కానీ, థియేటర్లలో విడుదలైన వెర్షన్‌లో ఈ రెండూ కనిపించలేదు. అందుకే, కనీసం ఈ ‘బ్రాండ్ న్యూ వెర్షన్’ లోనైనా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు, కథ ఉంటే చాలు అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ కొత్త ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad