Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRK Sagar: ప్ర‌భాస్ సినిమాలో న‌టించి త‌ప్పు చేశా - మొగ‌లి రేకులు సాగ‌ర్ ఇంట్రెస్టింగ్...

RK Sagar: ప్ర‌భాస్ సినిమాలో న‌టించి త‌ప్పు చేశా – మొగ‌లి రేకులు సాగ‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

100 Movie: మొగ‌లి రేకులు సీరియ‌ల్‌తో తెలుగు నాట ఫేమ‌స్ అయ్యాడు సాగ‌ర్‌. ఈ సీరియ‌ల్‌లో ఆర్కే నాయుడు పాత్ర‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. నంది అవార్డుతో పాటు ప‌లు పుర‌స్కారాలు ద‌క్కించుకున్నాడు. మొగలి రేకులు ద్వారా వ‌చ్చిన పాపులారిటీతో తెలుగులో కొన్ని సినిమాల్లో న‌టించాడు సాగ‌ర్‌. స్మాల్ స్క్రీన్‌పై వ‌చ్చిన స్టార్‌డ‌మ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాత్రం సాగ‌ర్‌కు ద‌క్క‌లేదు. హీరోగా సిద్ధార్థ‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు షాదీ ముబార‌క్ సినిమాలు చేశాడు.

- Advertisement -

నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌..
దాదాపు నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత హీరోగా ది 100 మూవీ చేస్తున్నాడు సాగ‌ర్‌. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలో విక్రాంత్ అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా అత‌డు క‌నిపించ‌బోతున్నాడు. జూలై 11న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ది 100 ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న సాగ‌ర్… ప్ర‌భాస్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ మూవీపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. సుమ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ టాక్ షోకు సాగ‌ర్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ఈ షోలో అన‌వ‌స‌రంగా న‌టించి త‌ప్పు చేశాను అని రిగ్రేట్‌గా ఫీల‌య్యే సినిమాలు మీ కెరీర్‌లో ఏమైనా ఉన్నాయా అని సాగ‌ర్‌ను అడిగింది సుమ‌. ఆమె  ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమా చేయ‌డం త‌న కెరీర్‌లో బ్యాడ్ ఇన్సిడెన్స్ అని సాగ‌ర్ చెప్పాడు.

Also Read – Nagarjuna Akkineni: నాగార్జున మైల్‌స్టోన్ మూవీ.. రీమేక్‌పై క‌న్నేసిన కింగ్

ప్ర‌భాస్ స్నేహితుడిగా…
మొగ‌లి రేకులు సీరియ‌ల్‌కు మంచి క్రేజ్ ఉన్న టైమ్‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని సాగ‌ర్ అన్నాడు. “ప్ర‌భాస్ స్నేహితుడిగా సెకండ్ లీడ్ రోల్ అన‌డంతో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమా అంగీక‌రించా. సీరియ‌ల్ కార‌ణంగా సినిమాకు డేట్స్ కేటాయించ‌డం క‌ష్ట‌మైంది. అయినా పెద్ద బ్యాన‌ర్ నిర్మిస్తున్న మూవీ, మంచి అవ‌కాశం అని అనిపించి ఎన్నో ఇబ్బందుల మ‌ధ్య ప‌దిహేను రోజులు డేట్స్ కేటాయించా. మొద‌టి మూడు రోజులు నాకు షూట్‌లో పాల్గొనే ఛాన్స్ రాలేదు. అదేంట‌ని అడిగితే రెండు, మూడు సీన్స్ తీశారు.

సెట్స్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత నేను ఊహించిన దానికి అంత రివ‌ర్స్‌గా అక్క‌డ క‌నిపించింది. క్యారెక్ట‌రైజేష‌న్ డిఫ‌రెంట్‌గా అనిపించింది. డైరెక్ట‌ర్‌ను క‌లిసి నా సిట్యూవేష‌న్ చెప్పా. అప్పుడ‌ప్పుడు క్యారెక్ట‌ర్స్ మారుతాయి కామ‌న్ అన్న‌ట్లుగా స‌మాధాన‌మిచ్చారు. ఇలాగైతే  నేను సినిమా చేయ‌న‌ని, నా ప్లేస్‌లో మ‌రో యాక్ట‌ర్‌ను తీసుకొని అత‌డిపై అప్ప‌టివ‌ర‌కు తీసిన సీన్స్‌ను రీప్లేస్ చేయ‌మ‌ని చెప్పి వ‌చ్చేశాను. కానీ నేను న‌టించిన సీన్స్‌ను సినిమాలో అలాగే ఉంచారు. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ మూవీతోనే చేస్తే సోలో హీరోగానే సినిమాలు చేయాల‌ని ఫిక్స‌య్యాను” అని సాగ‌ర్ అన్నాడు.

Also Read – Fruit Peels: షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే ఈ పండ్ల తొక్కలు తినాల్సిందే!!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad