RK Sagar: మొగలి రేకులు సాగర్ హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100 ఓటీటీలోకి వచ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ మూవీ రిలీజైంది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ద్వారా ది 100 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్…
ది 100 మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో ధన్యబాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ మినిస్టర్స్ పాల్గొనడంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. కాన్సెప్ట్ బాగున్నా ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడనే విమర్శలు వచ్చాయి.
అర్జున్ రెడ్డి ఫేమ్…
ది 100 మూవీకి అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించాడు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూలై సెకండ్ వీక్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
ది 100 మూవీ కథ ఇదే…
విక్రాంత్ (ఐపీఎస్) ట్రైనింగ్ పూర్తిచేసుకొని డ్యూటీలో చేరుతాడు. నగరంలో ఓ గ్యాంగ్ వరుసగా హత్యలకు పాల్పడుతుంటుంది. ఆ కేసును సవాల్‌గా తీసుకుంటాడు విక్రాంత్. తాను ప్రేమించిన ఆర్తి( మిషా నారంగ్) కి కూడా ఈ గ్యాంగ్ కారణంగా అన్యాయం జరిగిందనే నిజం ఇన్వేస్టిగేషన్‌లో విక్రాంత్ తెలుసుకుంటాడు. ఆ గ్యాంగ్‌ను పట్టుకున్న తర్వాతే ఆర్తి కేసుకు ఆ క్రిమినల్స్‌తో సంబంధం లేదని నిజం బయటపడుతుంది. అసలు నేరస్తులను విక్రాంత్ ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో అతడిని ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అన్నదే ది 100 మూవీ మిగతా కథ.
మొగులి రేకులు సీరియల్‌తో…
మొగలి రేకులు సీరియల్‌తో యాక్టర్‌గా సాగర్ కెరీర్ మొదలైంది. ఈ సీరియల్‌లో ఆర్‌కే నాయుడు క్యారెక్టర్‌లో కనిపించారు. ఈ సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాగర్ సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, షాదీ ముబారక్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. ఈ వారం ది 100తో పాటు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


