Mohan Babu: నాని ప్యారడైజ్ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ మోహన్‌బాబు విలన్‌గా నటించబోతున్నట్లు మేకర్స్ శనివారం ప్రకటించారు. మోహన్‌బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్యారడైజ్‌లో శికంజ మాలిక్ అనే పాత్రలో మోహన్‌బాబు కనిపించబోతున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కత్తిపై చేయి ఆనించి ఠీవీగా కూర్చొని పవర్‌ఫుల్ లుక్‌లో మోహన్‌బాబు కనిపించారు. ఆయన చేతులకు రక్తం మరకలు ఉండటం ఆసక్తిని పంచుతోంది. మోహన్‌బాబు పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పీక్స్‌లో విలనిజం…
ప్యారడైజ్‌లో మోహన్‌బాబు విలనిజం పీక్స్‌లో ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. వింటేజ్ మోహన్‌బాబును ఈ మూవీ గుర్తుకు తెస్తుందని అన్నారు. మోహన్‌బాబు ట్రేడ్ మార్కు పంచ్ డైలాగ్స్, మ్యానరిజమ్స్‌తో డిఫరెంట్‌గా శికంజ మాలిక్ క్యారెక్టర్‌ను శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేసినట్లు సమాచారం.
Also Read- Puri Sethupathi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీ టైటిల్ లీక్.. ఏంటంటే?
హైదరాబాద్‌లో షూటింగ్…
ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో మోహన్‌బాబు జాయిన్ అయ్యాడు. దాదాపు మూడు ఏకరాల్లో వేసిన భారీ స్లమ్ సెట్‌లో నాని, మోహన్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
దసరా తర్వాత…
దసరా తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ఇది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ప్యారడైజ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ ఇప్పటివరకు కన్ఫామ్ చేయలేదు. నానికి జోడీగా నటించనున్నట్లు భాగ్యశ్రీ బోర్సే, కయదు లోహర్‌తో పాటు మరికొందరు నాయికల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే హీరోయిన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
రిలీజ్ పోస్ట్‌పోన్…
ప్యారడైజ్ మూవీని 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. మార్చి 27న రామ్‌చరణ్ పెద్ది సినిమా కూడా రిలీజ్ అవుతోంది. రెండు పెద్ద సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారబోతుంది. ఈ రెండింటిలో ఓ సినిమా వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్యారడైజ్ పోస్ట్‌పోన్ కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read- Deepika Padukone: ప్రభాస్‌కు హ్యాండిచ్చి…. హాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్న దీపికా పదుకొనె
ప్యారడైజ్ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజీత్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నారు. డార్క్ హ్యూమర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


