Friday, June 6, 2025
Homeచిత్ర ప్రభMohan babu: మై కన్నప్ప స్టోరీ: మోహన్ బాబు

Mohan babu: మై కన్నప్ప స్టోరీ: మోహన్ బాబు

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ (Kannappa)చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మోహన్‌బాబు తాజాగా ఒక ప్రత్యేక వీడియో షేర్‌ చేశారు. ‘మై కన్నప్ప స్టోరీ’ అని పేర్కొంటూ తన తల్లి గురించి మాట్లాడారు.

‘‘ఓ అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు.. పరమేశ్వరుడికి తన కళ్లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు. మన ఆకలి తెలుసుకుని అమ్మ అడగకుండానే అన్నం పెడుతుంది. మనకు ఏది కావాలంటే దానిని వారి శక్తికి మించి అమ్మానాన్నలు మనకు ఇస్తారు. నా దృష్టిలో మా అమ్మానాన్నలు కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తు ఆమెకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించేవి కాదు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదుగురు సంతానాన్ని ప్రసాదించాడు. టౌన్‌ నుంచి మా ఊరుకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడవాల్సి ఉండేది. ఆ దారి కూడా అంతంత మాత్రం గానే ఉండేది. ఒక కాలువ, సువర్ణముఖి నదిని దాటితేగాని ఊర్లోకి వెళ్లలేం. అలా, మమ్మల్ని అందరినీ మోసుకుంటూ అమ్మ ఆ దారిలోనే ప్రయాణించేది. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాలు తలుచుకుంటే భావోద్వేగంగా అనిపిస్తుంది. నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు.. ‘ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరా అని అనుకుని బాధపడేవాడిని. నాకు నా కన్నతల్లే కన్నప్ప’’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News