Mohan Babu: టాలీవుడ్‌లోకి కొత్త వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడోతరం తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతుంది. మహేష్‌బాబు అన్నయ్య, రమేష్‌బాబు ఫ్యామిలీ నుంచి ఆయన కొడుకుతో పాటు కూతురు యాక్టర్లుగా కెమెరా ముందుకు రాబోతున్నారు.
అజయ్ భూపతి సినిమాతో…
రొమాంటిక్ లవ్‌స్టోరీతో రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు. జయకృష్ణ డెబ్యూ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది.
మోహన్‌బాబు విలన్…
జయకృష్ణ డెబ్యూ సినిమాలో మోహన్‌బాబు విలన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విలన్ రోల్ కోసం పలువురు సీనియర్ స్టార్స్‌ను పరిశీలించిన మేకర్స్ చివరకు మోహన్‌బాబును సంప్రదించినట్లు తెలిసింది. మోహన్‌బాబు కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. విలన్‌గా వింటేజ్ మోహన్‌బాబును ఈ క్యారెక్టర్ గుర్తుకు తెస్తుందని అంటున్నారు.
Also Read – Vinakaya Chavithi: సృష్టిలోనే త్రిమూర్తులతో మొదటి గణపయ్య ఆలయం…. ఎక్కడో తెలుసా?
శ్రీనివాస మంగాపురం…
ఈ రొమాంటిక్ లవ్‌డ్రామా మూవీకి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం. ఆర్ఎక్స్ 100 తరహాలోనే షాకింగ్ క్లైమాక్స్‌తో డైరెక్టర్ అజయ్ భూపతి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ సెకండ్ వీక్‌లో జయకృష్ణ డెబ్యూ మూవీ లాంఛ్ కానుందట. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌కు ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం హాజరు కానున్నట్లు చెబుతున్నారు.
తేజ సినిమాతో…
రమేష్‌బాబు కూతురు భారతి కూడా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ తేజ తన కొడుకు అమితావ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించబోతున్న సినిమాలో భారతి కథానాయికగా నటించనున్నట్లు కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
హీరోగా…
రమేష్‌బాబు హీరోగా తెలుగులో చాలానే సినిమాలు చేశారు. బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, నా ఇల్లే నా స్వర్గం, అన్నాచెల్లెలుతో పాటు పలు సినిమాలు నటుడిగా రమేష్‌బాబుకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అనారోగ్య సమస్యలతో 2022లో రమేష్‌బాబు కన్నుమూశారు.
Also Read – Nikki Bhati : నిక్కీ భాటి హత్య కేసు.. సిలిండర్ పేలుడు కాదు, ప్రణాళికాబద్ధమైన హత్య!


