Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNani 'The Paradise': 'ది ప్యారడైజ్‌'లో మోహన్‌ బాబు విలన్‌ రోల్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు...

Nani ‘The Paradise’: ‘ది ప్యారడైజ్‌’లో మోహన్‌ బాబు విలన్‌ రోల్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి

Nani ‘The Paradise’: న్యాచురల్‌ స్టార్‌ నాని కొత్త మూవీ ‘ది ప్యారడైజ్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాని ఫస్ట్‌ లుక్‌.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా, ఈ సినిమాలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు విలన్‌ పాత్ర చేస్తున్నట్లు ఇప్పటికే పలు రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ వైరల్‌ న్యూస్‌పై సినీ నటి మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన లక్ష్మీ.. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. 

- Advertisement -

సినిమా సినిమాకు తన పాత్రల్లో వేరియేషన్‌ చూపించడంలో నాని గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా సూపర్‌ హిట్లతో దూసుకుపోతున్న నాని.. ఇటీవలే ‘హిట్ 3’ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్‌’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎస్‌ఎల్‌వీ కసినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ మంచి హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: https://teluguprabha.net/cinema-news/mirai-movie-box-office-collection-day1-teja-sajja-highest-opening/

‘ది ప్యారడైజ్‌’లో నాని ‘జడల్’ అనే పాత్రలో అలరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో 30 ఎకరాల విస్తీర్ణంలో ఓ స్లమ్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ మూవీలో మంచు మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ నచ్చడంతో మోహన్‌బాబు వెంటనే ఓకే చెప్పేశారని ప్రచారం జరగ్గా.. దీనిపై మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఇది రూమర్‌ అనుకున్నారు. 

అయితే ఇటీవల ‘దక్ష’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న మంచు లక్ష్మి.. ది ప్యారడైజ్‌లో మోహన్‌బాబు రోల్‌ను కన్‌ఫర్మ్‌ చేసేశారు. తన తండ్రి క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ‘ది ప్యారడైజ్’ అప్‌డేట్ ఇచ్చారు. ‘నాన్న రోల్‌ విషయం అఫీషియల్‌గా బయటకు వచ్చిందో లేదో నాకు తెలియదు గానీ చెప్పేస్తున్నా. ‘ది ప్యారడైజ్’లో నాన్న కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన ఓ సినిమా కోసం ఎంతో పడటమే కాకుండా.. దాన్ని తన తొలి చిత్రంగానే ట్రీట్ చేస్తున్నారు. లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఆయన స్థాయిలో మరో నటుడైతే ఎలా ఉంటే అలాగే నటిస్తానని కండిషన్లు పెడతారు. కానీ నాన్న మాత్రం క్యారెక్టర్ కోసం తనని తాను మలుచుకుంటున్నారు.’ అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. 

Also Read:https://teluguprabha.net/cinema-news/sai-dharam-tej-calls-for-aadhaar-link-to-kids-social-media/

మంచు లక్ష్మి చేసిన కామెంట్స్‌తో ‘ది ప్యారడైజ్’ మూవీలో మోహన్‌బాబు నటిస్తున్నారన్నది ఫిక్స్ అయింది. ఇక దీనిపై మేకర్స్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం వేచి చూడాలి. అయితే మరోవైపు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ క్యామియో రోల్ ఉందని, దాన్ని చిరంజీవితో చేయించాలని శ్రీకాంత్ ఓదెల భావించారట. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి కలిసి కథ వినిపించగా చిరంజీవి వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. త్వరలోనే ఆయన సెట్‌లోకి అడుగపెట్టునున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad