Mega 158: మన శంకర వరప్రసాద్‌గారుతో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. మన శంకర వరప్రసాద్‌గారులో టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
మెగా 158…
మన శంకర వరప్రసాద్‌గారు షూటింగ్‌ను నవంబర్‌లో ఫినిష్ చేయనున్న చిరంజీవి వెంటనే బాబీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న 158వ సినిమా ఇది. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ నవంబర్ 5న లాంఛ్ కానుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నది. మెగా 158తోనే కేవీఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
Also Read – Bigg Boss Telugu: సంజనా.. నీకు నాకు పెళ్లి చూపులా..? నాగ్ షాకింగ్ రియాక్షన్
గెస్ట్ రోల్…
నవంబర్ నెలాఖరు నుంచి మెగా 158 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గెస్ట్ రోల్ కోసం పలువురు పాన్ ఇండియన్ స్టార్లను అనుకున్న మేకర్స్ చివరకు మోహన్‌లాల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. గెస్ట్ రోల్ అయినా ఎక్కువ నిడివితో కూడి ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో చిరంజీవి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. థియేటర్లలో ఆ ఫైట్ సీక్వెన్స్ మాస్ రచ్చను సృష్టించడం ఖాయమని అంటున్నారు. కాగా మెగా 158లో రాజాసాబ్ ఫేమ్ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
విశ్వంభర…
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో ఇది సెకండ్ మూవీ. గతంలో వీరిద్దరి కలయికలో రూపొందిన వాల్తేర్ వీరయ్య బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 150 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారుతో పాటు విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా రిలీజ్ డేట్ డిలే అవుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read – Bigg Boss Sreeja: బిగ్ బాస్ కోసం మంచి ఉద్యోగం వదిలేశా.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ


